Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgనేటితో వరుసగా మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. ఏపీకి తెలంగాణకు కేటాయింపుల విషయంలో మరోసారి ముఖం చాటేశారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పనుల కింద బాగానే కేటాయించారు. మెట్రో రైలు, జాతీయ రహదారులు ప్రాజెక్టులు భారీ స్థాయిలోనే ప్రకటించారు. చెన్నై మెట్రో రైలు విస్తరణకు రూ.63, 246 కోట్లు కేటాయించారు. అలాగే బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు.nirmala sitharaman;prema;kerala;hyderabad;india;nirmala sitharaman;karnataka - bengaluru;narendra modi;government;love;minister;chennai;tamilnadu;central governmentపుట్టింటి పై ప్రేమ..... అత్తింటి పై అలక..... నిర్మల సీతారామన్ గారి బడ్జెట్ తీరు లో...!!!పుట్టింటి పై ప్రేమ..... అత్తింటి పై అలక..... నిర్మల సీతారామన్ గారి బడ్జెట్ తీరు లో...!!!nirmala sitharaman;prema;kerala;hyderabad;india;nirmala sitharaman;karnataka - bengaluru;narendra modi;government;love;minister;chennai;tamilnadu;central governmentMon, 01 Feb 2021 23:25:22 GMTపుట్టింటి పై ప్రేమ..... అత్తింటి పై  అలక..... నిర్మల సీతారామన్ గారి  బడ్జెట్ తీరు లో...!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

హైదరాబాద్: పుట్టింటిపై ఉండే ప్రేమ అత్తింటిపై ఉండదని నానుడి. ఈరోజు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో (2021-22) ఆ విషయం స్పష్టంగా కనిపించింది. స్వరాష్ట్రం తమిళనాడుకు భారీగా కేటాయింపులు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మెట్టినిళ్లు తెలుగు నేలకు మొండి చేయి చూపించారు. నిధులు మాట అటుంచితే బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలుగు రాష్ట్రాల పేరు పెద్దగా ప్రస్తావించలేదు.

మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చేరినప్పటి నుంచి, తెలుగింటి కోడలిగా ఆమెపై తెలుగు వారికి అనేక ఆశలు ఉన్నాయి. ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాదైనా తెలుగు రాష్ట్రాలకు భారీగానే నిధులు వస్తాయని అనుకున్న వారికి భంగపాటు తప్పడం లేదు.
నేటితో వరుసగా మూడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా.. ఏపీకి తెలంగాణకు కేటాయింపుల విషయంలో మరోసారి ముఖం చాటేశారు. తమిళనాడు సహా దక్షిణాదిలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పనుల కింద బాగానే కేటాయించారు. మెట్రో రైలు, జాతీయ రహదారులు ప్రాజెక్టులు భారీ స్థాయిలోనే ప్రకటించారు.

చెన్నై మెట్రో రైలు విస్తరణకు రూ.63, 246 కోట్లు కేటాయించారు. అలాగే బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను నిర్మించేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ కేటాయింపులేవీ తెలుగు రాష్ట్రాల వరకు రాకపోవడం బాధాకరం. నిర్మలా బడ్జెట్‌పై తెలుగు నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ''పుట్టింటి మీద ప్రేమ.. అత్తింటి మీద అలక'' అంటూ నిర్మలాపై నెటిజెన్లు జోకులు వేస్తున్నారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.



డేటింగ్ యాప్ లో నా ఫోటోలు ఉన్నాయ్..క్లారిటీ ఇచ్చిన పునర్నవి..!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>