Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-england49f64047-9fb8-4c90-9aaa-fcb1d95fd42b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/india-vs-england49f64047-9fb8-4c90-9aaa-fcb1d95fd42b-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. తొలి టెస్టు విషయంలో తమిళనాడు క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించిన విషయమే దీనికి కారణం. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా 4 టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరీస్‌లో తొలి రెండు టెస్టులు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో..india vs england;cricket;bcci;prime minister;february;aaviriఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు ప్రేక్షకులకు చేదు వార్త..ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు ప్రేక్షకులకు చేదు వార్త..india vs england;cricket;bcci;prime minister;february;aaviriMon, 01 Feb 2021 19:22:46 GMTఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. తొలి టెస్టు విషయంలో తమిళనాడు క్రికెట్ బోర్డు తాజాగా వెల్లడించిన విషయమే దీనికి కారణం. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో టీమిండియా 4 టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీరీస్‌లో తొలి రెండు టెస్టులు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ప్రకటిచింది. ఆ తరువాత జరిగే రెండు టెస్టులను అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ విషయంపైనే ఇటీవల ఓ బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించనున్నట్టు స్పష్టం చేశారు.  ‘అవును, మొతేరా టెస్టులకు క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తాం’ అని ఆయన తెలిపారు. అంతేకాదు ఈ టెస్టులకు దేశ ప్రధాని మోదీని కూడా ఆహ్వానించే అవకాశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తొలి రెండు టెస్టుల విషయంలోనే అసలు చిక్కు వచ్చి పడింది. చిదంబరం స్టేడియంలో జరిగే ఈ రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించమంటూ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) ఇంతకుముందు ప్రకటించింది. ఈ విషయంపై టీఎన్‌సీఏ కార్యదర్శి ఆర్ఎస్ రామస్వామి బీసీసీఐతో చర్చిస్తారని, ఆ తర్వాత అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని టీఎన్‌సీఏ పేర్కొంది. అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను కొంతమేర సడలించడంతో రెండో టెస్టుకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

టీఎన్‌సీఏ ప్రకటనతో దాదాపు ఏడాది తరువాత భారత్‌లో మళ్లీ స్టేడియంలో లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడవచ్చని భారత క్రికెట్ అభిమానులంతా తెగ సంబరపడిపోయారు. కానీ వారి ఆనందాన్ని ఆవిరి చేస్తూ టీఎన్‌సీఏ తాజా ప్రకటన విడుదల చేసింది. తగిన సమయం లేకపోవడంతో తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించడం లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. తొలి టెస్టు ఈ నెల 5న ప్రారంభం కానుండగా, రెండో టెస్టు 13న అదే స్టేడియంలో మొదలవుతుంది. అయితే తగిన సమయం లేకపోవడంతో తొలి టెస్టుకు ప్రేక్షకులను అనుమతించేందుకు ఏర్పాటు పూర్తి కాలేదని, అందువల్ల రెండో టెస్టు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామని టీఎన్‌సీఏ తెలిపింది. దీంతో మరో నాలుగు రోజుల్లో స్టేడియంలకు వెళ్లి మ్యాచ్ చూద్దామని అశపడిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.


రేవంత్ రెడ్డి సంచలనం! అది జరిగితే దేశ విభజనే?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>