PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maskof938b40d-bc66-4517-8c23-aa9c76fd155c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/maskof938b40d-bc66-4517-8c23-aa9c76fd155c-415x250-IndiaHerald.jpgర‌ష్యాలో నిర‌స‌న జ్వాల‌లు ఎగిసిప‌డుతున్నాయి. జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశంలో ఆదివారం ఆందోళలు తీవ్రతరమయ్యాయి. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. వెయ్యి మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మాస్కో లో..అలెక్సీ నావల్సీ భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌లు మాస్కోలోని వీధుల్లోకి చేరి ఆందోళ‌న‌లు చేస్తున్నారు. 2014లో ఆరmasko;russia;police;bus;moscow;arrest;murder.ర‌ష్యాలో పుతిన్‌కు మూడిందిగా...ఎగిసిపడుతున్న నిర‌స‌న‌లు...ర‌ష్యాలో పుతిన్‌కు మూడిందిగా...ఎగిసిపడుతున్న నిర‌స‌న‌లు...masko;russia;police;bus;moscow;arrest;murder.Mon, 01 Feb 2021 09:37:12 GMTరష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ దేశంలో ఆదివారం ఆందోళలు తీవ్రతరమయ్యాయి. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు. వెయ్యి మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మాస్కో లో..అలెక్సీ నావల్సీ భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ల‌క్ష‌లాదిమంది ప్ర‌జ‌లు మాస్కోలోని వీధుల్లోకి చేరి ఆందోళ‌న‌లు చేస్తున్నారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు నావల్నీ ఎదుర్కొంటున్నారు.



 ఆ సమయంలో గత సంవత్సరం ఆయనపై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అధ్యక్షుడు పుతిన్‌ తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేసినట్లు వచ్చిన ఆరోపణలను క్రెమ్లిన్‌ ఖండించింది. అయితే, ప్రతిపక్ష నాయకుడి అరెస్టును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసు ప్రధాన కార్యాలయానికి నిలయమైన మాస్కోలోని లుబియాంకా స్కేర్లో ఆదివారం నిరసనకు నావాల్నీ బృందం మొదట పిలుపునిచ్చింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో స్కేర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో నిరసన ఒక మైలు దూరంలో ఉన్న మరొక సెంట్రల్‌ స్కేర్‌కు మారింది. అక్కడికి చేరుకున్న వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.


 ఇదిలా ఉండగా పుతిన్ ప్ర‌భుత్వం అవినీతిలో కూరుకుపోయింద‌ని తెలిపే ఓ నివేదిక‌ను తాజాగా నావ‌ల్నీ బృందం వెలుగులోకి తీసుకువ‌చ్చింది. దాని ప్ర‌కారం.. పుతిన్ ఆవాసం ఉంటున్న భవనంలో మరుగుదొడ్లు కడిగేందుకు వాడే బ్రష్‌ విలువ రూ. 45వేలు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెందినదిగా ప్రతిపక్ష నేత నావల్నీ బృందం వెల్లడించిన రూ. 9800కోట్ల భవనంలో విలాసమిది. ఓవైపు దేశ ప్రజలు దారిద్య్రంతో కొట్టుమిట్టాడుతుంటే, పుతిన్‌ అవినీతి ఈస్థాయిలో ఉండటంతో ప్రజలు మండిప‌డుతున్నారు. జైలు శిక్షలు విధిస్తామన్న హెచ్చరికలు, భారీ స్థాయిలో బలగాల మోహరింపు కూడా వారిని అడ్డుకోలేకపోయాయి. మా స్కోలో అయితే లాక్‌డౌన్‌ పరిస్థితి నెలకొంది. బస్సుల్ని, రైళ్లను నిలిపేశారు.




"మనం" సీక్వెల్.. నాగార్జున ఏం అంటున్నాడంటే?

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>