PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrce7b5f3f-8a4b-4588-99d4-b08881224752-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktrce7b5f3f-8a4b-4588-99d4-b08881224752-415x250-IndiaHerald.jpgఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బీజేపీ చేసిన దాడిని మంత్రి కేటిఆర్ ఖండించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు అని ఆయన స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ బిజktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mla;minister;party;shaktiబిజెపికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన కేటిఆర్బిజెపికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన కేటిఆర్ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mla;minister;party;shaktiMon, 01 Feb 2021 10:00:00 GMTఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బీజేపీ చేసిన దాడిని మంత్రి కేటిఆర్ ఖండించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు అని ఆయన స్పష్టం చేసారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది అని ఆయన వ్యాఖ్యానించారు.

గతంలోనూ బిజెపి భౌతిక దాడులకు ప్రయత్నించింది అని మండిపడ్డారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బిజెపి పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదు అని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బిజెపి కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నా అని అన్నారు. బిజెపి భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బిజెపిని హెచ్చరించాం అని ఆయన వెల్లడించారు.  అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బిజెపి మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని అన్నారు.  ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బిజెపిని ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.


పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>