PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/jagan-nimmagadda-electionsea49e3d9-5977-4166-8801-b16c314e68af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/jagan-nimmagadda-electionsea49e3d9-5977-4166-8801-b16c314e68af-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ప్రతీ అంశాన్ని కూడా టీడీపీ నేతలు ఇప్పుడు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నా సరే అనేక ఇబ్బందులు ఇప్పుడు పెట్టడంపై టీడీపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేయడమేap;ashok;telugu desam party;andhra pradesh;telugu;police;tdp;local language;central government;partyజగడ్డ: ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బలగాలు వస్తాయా...జగడ్డ: ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర బలగాలు వస్తాయా...ap;ashok;telugu desam party;andhra pradesh;telugu;police;tdp;local language;central government;partyMon, 01 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో అధికార పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ప్రతీ అంశాన్ని కూడా టీడీపీ నేతలు ఇప్పుడు సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఇప్పుడు ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నా సరే అనేక ఇబ్బందులు ఇప్పుడు పెట్టడంపై టీడీపీ నేతలు చాలా సీరియస్ గా ఉన్నారు.

ఇక ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా టీడీపీ నేతలు వాస్తవ పరిస్థితి మీద నివేదికలు కూడా తమ నేతల వద్ద నుంచి తెప్పించుకునే పరిస్థితి ఉంది. తాజాగా ఎస్ ఈ సీ కి టీడీపీ  ఎమ్మెల్సి అశోక్ బాబు ఫిర్యాదు చేసారు. సమ‌స్మాత్మ‌క పంచాయితీల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణను కేంద్ర బ‌ల‌గాల‌తో, పోరుగు రాష్ట్రాల‌ నుండి తీసుకువ‌చ్చిన వారితో నిర్వ‌హించాల‌ని ఎస్ ఈ సీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. గ‌త ఏడాది మార్చిలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జెడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ విప‌క్షాల‌ను పోటీ చేయ‌నివ్వ‌కుండా అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డింది అని  ఆయన ఆరోపించారు.

అధికార పార్టీకి అటు పోలీసులు కూడా అండ‌గా నిలుస్తున్నందున వారితో కాకుండా కేంద్ర‌, పోరుగు రాష్ట్రాల బ‌ల‌గాల‌తో ఎన్నిక‌లు నిర్వ‌హించాలి అని టిడీపీ విజ్జ‌ప్తి చేసింది. పులివెందుల‌, శ్రీకాళ‌హ‌స్తి, రాయ‌చోటి, తంబాల‌ప‌ల్లి, పుంగ‌నూరు ల‌లో అన్ని ఎంపిటీసీ స్ధానాలు అక్ర‌మంగా ఏక‌గ్రీవం అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇదే త‌ర‌హ‌లో ఇప్ప‌డు పోటీ లేద‌నే నెపంతో పంచాయితీలు ఏక‌గ్రీవం చేయాల‌ని చూస్తున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేస్తున్నందున స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో వారితో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌ష్టం అని ఎన్నికల సంఘానికి వివరించారు.


బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>