MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-is-haunted-by-sridevi-rajamouli-clash-againcb3588a7-ea64-4522-bca6-ed04784cb69a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-is-haunted-by-sridevi-rajamouli-clash-againcb3588a7-ea64-4522-bca6-ed04784cb69a-415x250-IndiaHerald.jpg‘బాహుబలి’ నిర్మాణం ప్రారంభించే ముందు రాజమౌళి ఆ మూవీలోని శివగామి పాత్రకు శ్రీదేవితో సంప్రదింపులు జరిపాడు. అయితే అప్పట్లో ఆమె ‘బాహుబలి’ లో నటించడానికి అత్యంత భారీ పారితోషికం అడగడంతో రాజమౌళి ఆమెను తప్పించి ఆ పాత్రకు రమ్యకృష్ణ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.అప్పట్లో రాజమౌళి ఈ విషయమై స్పందిస్తూ శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పుకుని చేసి ఉంటే రమ్యకృష్ణ లాంటి అద్భుతమైన నటిని మిస్ అయి ఉండే వాడిని అంటూ ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆరోజులలో చాల ఘాటుగా స్పందించాడrajamouli rrr;ajay devgn;boney kapoor;sridevi kapoor;ajay;ramya krishnan;rajamouli;bollywood;rrr movie;cinema;bahubali;media;producer;history;interview;industry;director;husband;october;producer1;darsakudu;ishtamఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !rajamouli rrr;ajay devgn;boney kapoor;sridevi kapoor;ajay;ramya krishnan;rajamouli;bollywood;rrr movie;cinema;bahubali;media;producer;history;interview;industry;director;husband;october;producer1;darsakudu;ishtamMon, 01 Feb 2021 09:00:00 GMTరాజమౌళి ఆ మూవీలోని శివగామి పాత్రకు శ్రీదేవితో సంప్రదింపులు జరిపాడు. అయితే అప్పట్లో ఆమె ‘బాహుబలి’ లో నటించడానికి అత్యంత భారీ పారితోషికం అడగడంతో రాజమౌళి ఆమెను తప్పించి ఆ పాత్రకు రమ్యకృష్ణ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.


అప్పట్లో రాజమౌళి ఈ విషయమై స్పందిస్తూ శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పుకుని చేసి ఉంటే రమ్యకృష్ణ లాంటి అద్భుతమైన నటిని మిస్ అయి ఉండే వాడిని అంటూ ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో కామెంట్స్ చేశాడు. దీనిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ ఆరోజులలో చాల ఘాటుగా స్పందించాడు. ఇది అంతా అప్పటి చరిత్ర ఆనాటి నుండి బోనీకపూర్ రాజమౌళి ల మధ్య ఒక గ్యాప్ కొనసాగుతూనే ఉంది.


ఇప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ మరింత పెరిగే సందర్భం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ వల్ల  ఏర్పడిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. దీనికి కారణం బోనీకపూర్ రాజమౌళి ల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అక్టోబర్ 13న విడుదల కావడం బోనీకపూర్ కు ఏమాత్రం ఇష్టంలేదు. ఈయన నిర్మాణ సంస్థలో నిర్మింపబడ్డ అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘మైదాన్’ మూవీ కూడ అదే డేట్ కు విడుదల అవుతోంది.


ఈ విషయం తెలిసి ఉండి కూడ రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ ను ‘మైదాన్’ మూవీని పట్టించుకోకుండా అక్టోబర్ 13న విడుదల చేయడం బోనీకపూర్ కు తీవ్ర అసహనాన్ని కల్గించింది. ఈ రెండు సినిమాలలోను కీలక పాత్రలలో అజయ్ దేవగన్ నటిస్తున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ ను అదే డేట్ కు ఎందుకు విడుదల చేస్తున్నారు అని బోనీకపూర్ రాజమౌళిని అడిగితే అతడు తెలివిగా సమాధానం ఇచ్చినట్లు టాక్. తాను ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి కేవలం దర్శకుడుని మాత్రమే అనీ మూవీ రిలీజ్ విషయం నిశ్చయించేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు అని రాజమౌళి చెప్పిన సమాధానానికి బోనీకపూర్ తీవ్ర అసహనంలో ఉన్నాడని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..




ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>