PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy5c62a7fb-0dec-439f-b733-e7cab6a9e453-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy5c62a7fb-0dec-439f-b733-e7cab6a9e453-415x250-IndiaHerald.jpgమోడీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వాళ్లకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారేనని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు.revanth reddy;modi;kcr;revanth;kerala;bharatiya janata party;india;telangana;west bengal - kolkata;revanth reddy;mp;prime minister;minister;central government;reddy;leader;criminalరేవంత్ రెడ్డి సంచలనం! అది జరిగితే దేశ విభజనే?రేవంత్ రెడ్డి సంచలనం! అది జరిగితే దేశ విభజనే?revanth reddy;modi;kcr;revanth;kerala;bharatiya janata party;india;telangana;west bengal - kolkata;revanth reddy;mp;prime minister;minister;central government;reddy;leader;criminalMon, 01 Feb 2021 20:41:20 GMTతెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జమిలి ఎన్నికలు వస్తే దేశం రెండుగా విడిపోవడం ఖాయమన్నారు. ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం వస్తుందన్నారు రేవంత్ రెడ్డి.  దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు.. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే .. దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారుతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి.

        మోడీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వాళ్లకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ట్యాక్స్ అత్యధికంగా  కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారేనని, కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయన్నారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమన్నారు రేవంత్ రెడ్డి.  దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజ్యాంగాన్ని సవరణలు చేసినప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందన్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోడీపై ఎవరి ఒత్తిడో ఉందన్నారు.
 
           కేంద్ర బడ్జెట్ లో అన్ని అసత్యాలే ఉన్నాయన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. అబద్దాలు చెప్పడం లో మోడీ,కేసీఆర్ ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. గతంలో బీహార్‌కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారని.. అది ఏమైందన్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ లో ఎన్నికలు ఉండటంతో ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. కాని ఆ నిధులు ఇచ్చే పరిస్థితే ఉండదన్నారు రేవంత్ రెడ్డి.





బడ్జెట్ 2021 : మందు బాబులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం !!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>