Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanba420a01-7826-4d90-aaef-fe95751fd036-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyanba420a01-7826-4d90-aaef-fe95751fd036-415x250-IndiaHerald.jpgరెండేళ్లకు పైగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఒక్కో సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత పవన్ పింక్ రీమేక్ మూవీ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ ను కంప్లీట్ చేసుకోవడంతో పవన్ మలయాళం సూపర్ హిట్ మూవీ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమా షూటింగ్ పాల్గొంటున్నారు పవన్. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమానే pavankalyan;pawan;anjali;kalyan;pawan kalyan;cinema;remake;hero;posters;pink;dil‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ న్నే హైలెట్ చెయ్యడానికి కారణం ఇదేనా?‘వకీల్ సాబ్’ లో పవన్ కళ్యాణ్ న్నే హైలెట్ చెయ్యడానికి కారణం ఇదేనా?pavankalyan;pawan;anjali;kalyan;pawan kalyan;cinema;remake;hero;posters;pink;dilMon, 01 Feb 2021 10:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది వరుస ప్రాజెక్టులకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఒక్కో సినిమాను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత పవన్ పింక్ రీమేక్ మూవీ‘వకీల్ సాబ్’ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా  షూటింగ్ ను కంప్లీట్ చేసుకోవడంతో పవన్ మలయాళం సూపర్ హిట్ మూవీ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమా షూటింగ్ పాల్గొంటున్నారు పవన్. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవలె రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ విషయంలో అభిమానుల్లో కొన్ని సందేహాలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ ప్రమోషన్స్ లో ఇంతవరకు కథానాయికల్ని హైలెట్  చెయ్యలేదు. దీంతో ఎందుకు ఇలా చేశారు అంటూ పవన్ అభిమానులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంత వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ లో పవన్ కళ్యాణే హైలెట్ గా నిలిచారు. కానీ నిజానికి ఈ పింక్ సినిమాలో హీరోయిన్లదే ప్రధాన పాత్ర ఉంటుంది. పింక్ లో కిలాడీ వకీల్ గా కనిపించారు హీరో. తెలుగు రీమేక్ లో కూడా పవన్ వకీల్ గానే కనిపించనున్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో పవన్ ఇమేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రీమేక్ లో పవన్ పాత్ర నిడివి పెంచి  కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది.

సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా.. ఇంకా పోస్టర్ తోనే ఈ సినిమా హడావుడి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అసలు ఈ సినిమా ఒరిజినల్ ఫ్లేవర్ లో ఉంటుందా లేదా.. అనే అనుమానాలు వెళ్లువెత్తుతున్నాయి. ఇందులో  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నివేధ థామస్, అంజలి పోస్టర్లను ఇప్పటి వరకు రిలీజ్ చెయ్యలేదు. కాగా దాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు.. అంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికంతటికి కారణం మాత్రం దిల్ రాజు బిజినెట్ టెక్నిక్ లో భాగంగానే ఇలా పవన్ కళ్యాణే హైలెట్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మున్ముందు ప్రమోషన్స్ లోనైనా ఈ అనుమానాలు తొలగిపోతాయేమో చూడాలి మరి. 


పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>