MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nadhiyaaf8d0c7ae-736d-4e5a-a198-0e8b2a52e02a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nadhiyaaf8d0c7ae-736d-4e5a-a198-0e8b2a52e02a-415x250-IndiaHerald.jpgఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లకు ఎంత వయసు వచ్చినప్పటికీ వారి అందం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. నిన్నటి తరం హీరోయిన్లలో చాలామంది అందం విషయంలో నేటి తరం హీరోయిన్ లతో పోటీ పడుతున్నారన్నా విషయం అతిశయోక్తి కాదు. వారిలో ఒకరు నదియా కూడా. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ కు అత్తగా నటించిన నదియా, టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పట్లో కొత్త.. ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ.. ఎవరు ఈమె? ఈ వయసులో కూడా ఇంత అందంగా వుందే అని ప్రతి ఒక్కరూ అనుnadhiyaa;pawan;rajinikanth;pawan kalyan;surya sivakumar;varun;varun sandesh;varun tej;india;american samoa;tollywood;cinema;telugu;london;tamil;mirchi;marriage;industry;girl;heroine;indian;attharintiki daredi;a aaనదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!nadhiyaa;pawan;rajinikanth;pawan kalyan;surya sivakumar;varun;varun sandesh;varun tej;india;american samoa;tollywood;cinema;telugu;london;tamil;mirchi;marriage;industry;girl;heroine;indian;attharintiki daredi;a aaMon, 01 Feb 2021 16:30:00 GMTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లకు ఎంత వయసు వచ్చినప్పటికీ వారి అందం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది. నిన్నటి తరం హీరోయిన్లలో చాలామంది అందం విషయంలో నేటి తరం హీరోయిన్ లతో పోటీ పడుతున్నారన్నా  విషయం అతిశయోక్తి కాదు. వారిలో ఒకరు నదియా కూడా. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ కు అత్తగా నటించిన నదియా, టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పట్లో కొత్త.. ఈమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.  కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ.. ఎవరు ఈమె? ఈ వయసులో కూడా ఇంత అందంగా వుందే అని ప్రతి ఒక్కరూ అనుకున్న వారే. ఆ తర్వాత తెలుగులో మిర్చి, దృశ్యం, బ్రూస్ లీ, అ ఆ, నాపేరు సూర్య తో పాటు మిస్ ఇండియా వంటి సినిమాల్లో నటించి, తెలుగులో మోస్ట్ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సర్  సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది నదియా.


నదియా వ్యక్తిగత విషయానికొస్తే నదియా ఎన్ కే  మోయిదు అనే ముస్లిం అబ్బాయి కి లలిత అనే  హిందూ అమ్మాయి దంపతులకు జన్మించిన ఏకైక కుమార్తె నదియా.  పుట్టింది కేరళలోని అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే. చదువుకుంటున్న సమయంలోనే సినిమాల్లో నటించడానికి అవకాశం వచ్చింది. ఇక  చదువులకు పూర్తిగా గుడ్బై చెప్పి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 1984వ సంవత్సరంలో "నొక్కేతా దూరతు కన్నుమ్ నట్టు "అనే  మలయాళం సినిమా ద్వారా హీరోయిన్ గా  వెండితెరకు పరిచయం అయింది.


తొలి సినిమా ద్వారా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి,ఫిలింఫేర్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. మొదట మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటించి,ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేసింది. ఇక రజనీకాంత్,కమలహాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నదియా.

నదియా 1988 సంవత్సరంలో శిరీష గౌడ్ బోలె అనే ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని,తర్వాత అమెరికాలో స్థిరపడిపోయింది. ఇక ఈమె సినిమాలు చేయాలంటే మాత్రం అమెరికా నుంచి వచ్చి సినిమాలు చేసేది. ఈమెకు ఇద్దరు కూతుర్లు. ఒకరి పేరు సనమ్, మరొకరు జన. ఇక ఈ ఇద్దరి అమ్మాయిలను చూస్తే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఏ హీరోయిన్  వీరికి  సాటిరారని చెప్పవచ్చు.  ఈ అమ్మాయిలు ఇద్దరు పుట్టి పెరిగిన తర్వాత 2000 సంవత్సరం లో అమెరికా నుండి లండన్ వెళ్లి స్థిరపడింది. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో తిరిగి ఇండియాకు వచ్చి ముంబైలో స్థిరపడిపోయింది.




జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>