WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/freedom-fighter-preethi-latha6eed3d17-1ce6-403e-b3f0-18d369f72abf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/freedom-fighter-preethi-latha6eed3d17-1ce6-403e-b3f0-18d369f72abf-415x250-IndiaHerald.jpgప్రీతి లతా వడ్డేదార్.. భారతీయులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆమె ఇండియా కోసం చిన్న వయసులోనే చిరుత పులి లా పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె 21 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పరిపాలన పై చిన్నపాటి యుద్ధం చేశారు.freedom fighter preethi latha;women;chiranjeevi;prithy;surya sivakumar;india;police;september;tiger;army;office;tiger 1;calcutta;fidaa;chiruthaచిన్నవయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర వనిత గురించి మీకు తెలుసా..?చిన్నవయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వీర వనిత గురించి మీకు తెలుసా..?freedom fighter preethi latha;women;chiranjeevi;prithy;surya sivakumar;india;police;september;tiger;army;office;tiger 1;calcutta;fidaa;chiruthaMon, 01 Feb 2021 10:43:00 GMTప్రీతి లతా వడ్డేదార్.. భారతీయులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆమె ఇండియా కోసం చిన్న వయసులోనే చిరుత పులి లా పోరాడి ప్రాణాలర్పించిన గొప్ప స్వాతంత్ర సమరయోధురాలు. ఈమె 21 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పరిపాలన పై చిన్నపాటి యుద్ధం చేశారు. చిట్టాగాంగ్ లో తన బాల్య జీవితాన్ని గడిపిన ఆమె డాకా లో ఈడెన్ కాలేజి లో చదువుతున్నప్పుడు బ్రిటిష్ పరిపాలన పై తీవ్రమైన వ్యతిరేక భావాలను ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత మహిళా విప్లవకారులతో చేయి కలిపారు.

ఉన్నత చదువుల కోసం కలకత్తా వెళ్లిన ఆమె బేతున్ కళాశాలలో ఫిలాసఫీ విద్యార్థినిగా చేరారు. అయితే అక్కడే ఆమె సూర్య సేన్ అనే ఓ విప్లవకారుల గ్రూప్ లో జాయిన్ అయ్యారు. నిజానికి సూర్య సేన్ గ్రూపులో ఆడవాళ్లను జాయిన్ చేసుకునేవారు కాదు. కానీ ప్రీతి లతా కి దేశం పట్ల ఉన్న భక్తి కి మరియు ఆమె తెలివితేటలకు కి ఫిదా అయిపోయిన సూర్య సేన్ గ్రూపు సభ్యులు ఆమెను వెంటనే జాయిన్ చేసుకున్నారు. అయితే 1930 లో ఆర్మీ దాడి జరుగుతున్నప్పుడు బ్రిటిష్ దళాలు మీద భీకరమైన దాడి చేసి వారి టెలిఫోన్ లైన్లను మరియు టెలిఫోన్ ఆఫీసులను ధ్వంసం చేయడంలో ప్రీతి లతా వడ్డేదార్ కీలక పాత్ర పోషించారు.

1932లో సూర్య సేన్ అనే విప్లవకారుడి యొక్క ప్రణాళికలను అనుసరించి చిట్టగాంగ్‌లోని పహర్తాలి యూరోపియన్ క్లబ్‌పై దాడి చేయాలనుకున్నారు. ఐతే ఈ మిషన్ కి ప్రీతి లతా నాయకురాలిగా వ్యవహరించారు. 1932 సెప్టెంబర్ 23న క్లబ్ పై దాడి చేస్తున్న సమయం లో పోలీసుల కాల్పులలో ప్రీతి లతా కి ఒక బుల్లెట్ తగిలింది. అయితే దాడి జరుగుతున్న సమయంలో చాలామంది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సూర్య సేన్ గ్రూపు సభ్యులు తప్పించుకున్నారు. కానీ బుల్లెట్ గాయం తగిలిన ప్రీతి లతా మాత్రం పారిపోకుండా ధైర్యంగా నిలబడి పోలీసులను ఎదుర్కొన్నారు. పోలీసులు పట్టుకుంటున్న సమయంలో ఆమె సైనేడ్ మింగి చనిపోయారు. అయితే ఆ సమయానికి ఆమెకు కేవలం 21 ఏళ్ళే ఉన్నాయి.


నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>