Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bumra-valle-adantha-sadyam-ayyindi31d4319b-960d-4c7c-b4db-57cf632a1d85-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/bumra-valle-adantha-sadyam-ayyindi31d4319b-960d-4c7c-b4db-57cf632a1d85-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత జట్టులో జస్ప్రిత్ బూమ్రా ఎంత కీలక ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బూమ్రా ఆ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించుకుని తనదైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాట్మెన్ ల సరసన ఏ ప్లస్ గ్రేడ్ సొంతం చేసుకున్న ఏకైక బౌలర్ గా జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నాడు. టీమిండియాలో ఇక తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయbumhrah;anil music;rani;rohit;virat kohli;rohit sharma;jasprit bumrah;media;bcci;twitter;yuva;legendజస్ప్రిత్ బూమ్రా.. ఫాస్ట్ బౌలర్ కాదు.. లెగ్ స్పిన్నర్..?జస్ప్రిత్ బూమ్రా.. ఫాస్ట్ బౌలర్ కాదు.. లెగ్ స్పిన్నర్..?bumhrah;anil music;rani;rohit;virat kohli;rohit sharma;jasprit bumrah;media;bcci;twitter;yuva;legendMon, 01 Feb 2021 10:00:00 GMTజస్ప్రిత్ బూమ్రా ఎంత కీలక ఆటగాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన జస్ప్రిత్ బూమ్రా ఆ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించుకుని తనదైన ప్రదర్శనతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాట్మెన్ ల సరసన ఏ ప్లస్ గ్రేడ్  సొంతం చేసుకున్న ఏకైక బౌలర్ గా  జస్ప్రిత్ బూమ్రా కొనసాగుతున్నాడు. టీమిండియాలో ఇక తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాదు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో ఎప్పుడూ కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు జస్ప్రిత్ బుమ్రా.



 ఇక జస్ప్రిత్ బూమ్రా ఫాస్ట్ బౌలింగ్ కి అందరూ అవాక్కవుతూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. అతని బౌలింగ్ యాక్షన్ మిగతా బౌలర్లతో పోలిస్తే ఎంతో డిఫరెంట్గా ఉంటుంది. అంతే కాదు ఎంతో పదునైన యార్కర్లు విసురుతూ వికెట్లు పడగొడుతూ ఉంటాడు జస్ప్రిత్ బుమ్రా. ఇక ఇప్పుడు జస్ప్రిత్ బూమ్రా ఏకంగా లెగ్ స్పిన్నర్ గా మారిపోయాడు. అదేంటి బూమ్రా పేసర్ కదా అని అంటారా.. అయితే ఇటీవలే నెట్స్ లో  అతను లెగ్ స్పిన్  సాధన చేస్తున్నాడు.  భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ను అనుకరిస్తూ నెట్స్ లో  ప్రస్తుతం లెగ్ స్పిన్ బౌలింగ్ విసురుతున్నాడు.


 ఇటీవలే దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఇటీవలే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది ఇప్పటి వరకు ప్రతి ఒకరు జస్ ప్రీత్ బుమ్రా యార్కర్లు, బౌన్సర్లు చూశారు కానీ ఇప్పటివరకు ఏ  ఫాస్ట్ బౌలర్లు ప్రదర్శించని సరికొత్త వర్షన్ ను  చేస్తున్నాడు.  లెజెండ్ అనిల్ కుంబ్లే యాక్షన్ అనుసరిస్తున్నాడు అంటూ బిసిసిఐ ఒకవ్యాఖ్య జత చేసింది. దీనిపై వెంటనే స్పందించిన అనిల్ కుంబ్లే వెల్ డన్ బూమ్రా నాలాగే బౌలింగ్ చేస్తున్నావు..  ఎంతో మంది యువ బౌలర్లకు నువ్వుపూర్తి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
" style="height: 488px;">



పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>