PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు బలయిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సహకరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాటలు ఏ మాత్రం కూడా అధికారులు లెక్క చేయక పోవడంతో ఇప్పుడు ఆయన కేంద్ర హోం సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపnimmagadda;kumaar;bhavana;shankar;andhra pradesh;government;local language;central governmentజగడ్డ: మరికొంత మంది నిమ్మగడ్డకు బలైపోతారా...?జగడ్డ: మరికొంత మంది నిమ్మగడ్డకు బలైపోతారా...?nimmagadda;kumaar;bhavana;shankar;andhra pradesh;government;local language;central governmentMon, 01 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు బలయిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. కొంతమంది అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సహకరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాటలు ఏ మాత్రం కూడా అధికారులు లెక్క చేయక పోవడంతో ఇప్పుడు ఆయన కేంద్ర హోం సెక్రటరీ ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అడుగు కూడా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు చూసీచూడనట్లు వ్యవహరించిన రమేష్ కుమార్ మరి కొంతమంది విషయంలో మాత్రం కాస్త కఠినంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిణామాలు ఉన్నాయి. ఈ భిన్నమైన పరిణామాల నేపథ్యంలో కొంతమంది అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న కొంతమంది కీలక అధికారులు సహకరించడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. ముందుగా గోపాలకృష్ణ ద్వివేది గిరిజా శంకర్ ఇద్దరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సహకరించలేదు. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారిపై కఠిన నిర్ణయం తీసుకోవడంతో వాళ్ళిద్దరూ కూడా సహాయసహకారాలు అందిస్తున్నారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట లెక్క చేయడం లేదని అంటున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన కు సహకరించని కొంతమంది అధికారుల విషయంలో నిమ్మగడ్డ సీరియస్గానే చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆయన ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. ప్రభుత్వం మాట విని కొంత మంది అధికారులు ఇబ్బందిగా ప్రవర్తించడంపై నివేదిక కూడా రెడీ చేశారట.


బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>