Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgకేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 'ప్రత్యేక హోదా లేదు. ఆర్థికలోటు భర్తీ లేదు. 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు. అమరావతికి నిధులు లేవు. పోలవరానికి నిధులు లేవు. పునర్విభజన చట్టంలో అంశాలకు పరిష్కారం లేదు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్నే జగన్ రెడ్డి తాకట్టు పెట్టారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నమ్మకద్రోహం చేశారు. 28 మంది వైసీపీ ఎంపీలను తన కేసుల మాఫీ కోసమే వాడుతున్నారు' అని ఆరోపించారు.chandhra babu;cbn;india;jagan;amaravati;district;telugu;panchayati;tdp;central government;ycp;reddyవైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు ఏళ్ళు మాత్రమే ఉండేది : చంద్రబాబువైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు ఏళ్ళు మాత్రమే ఉండేది : చంద్రబాబుchandhra babu;cbn;india;jagan;amaravati;district;telugu;panchayati;tdp;central government;ycp;reddyMon, 01 Feb 2021 23:32:22 GMTవైసీపీ ప్రభుత్వం ఇంకా రెండు ఏళ్ళు మాత్రమే ఉండేది : చంద్రబాబుఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఊళ్లన్నీ మింగేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల రెండో దశ టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. 'పంచాయతీ ఎన్నికల 2వ దశ నామినేషన్లకు రేపే ప్రారంభం. అన్ని గ్రామాల్లో నామినేషన్లు రేపు దాఖలు చేయాలి. తొలిదశలో వైసీపీపై వీరోచితంగా పోరాడారు. రెండో దశలో కూడా రెట్టించిన స్ఫూర్తితో నామినేషన్లు వేయాలి. మీ ఊరి నుంచే, మీ గడపనుంచే మన పోరాటం ఆరంభం. వైసీపీ గెలిస్తే మీ ఊళ్లన్నీ మింగేస్తారు. రౌడీల పాలన అంతానికి తొలిమెట్టు ఇదే..
ఊరు బాగుండాలంటే తెలుగుదేశం గెలవాలి' అని ఆకాంక్షించారు.

ఊరికో బకాసురుడు...

'జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఊరికో బకాసురుడు తయారయ్యాడు. వైసీపీ భూ బకాసురులకు ఈ ఎన్నికల్లో బుద్దిచెప్పాలి. నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే టీడీపీ కంట్రోల్ రూమ్ దృష్టికి తేవాలి. నామినేషన్ పేపర్లు, ఫిర్యాదుల నకళ్లను ఎంక్లోజర్స్‌తో సహా జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల సంఘానికి, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. ఫొటో, వీడియో సాక్ష్యాధారాలను కూడా జత చేయాలి' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఏడాదో.. రెండేళ్లే..

'వైసీపీ ప్రభుత్వం ఉండేది ఇంకా ఏడాదో.. రెండేళ్లే. గెలిచే సర్పంచి ఉండేది 5 ఏళ్లు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. పాత బిల్లుల బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తాం. కొత్త పనులు మీ ద్వారానే జరుగుతాయి. ప్రతి ఊళ్లో 5 ఏళ్లలో రూ.5కోట్లతో అభివృద్ది పనులు. వైసీపీ గెలిస్తే ఈ రూ.5 కోట్లు వాళ్లే స్వాహా చేస్తారు. అభివృద్ది పనుల రూపంలో టీడీపీ గ్రామాభివృద్ది మీ కళ్ల ముందే ఉంది' అని తెలిపారు.

జగన్ రెడ్డి విఫలం..
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో జగన్ రెడ్డి విఫలం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 'ప్రత్యేక హోదా లేదు. ఆర్థికలోటు భర్తీ లేదు. 7 వెనుకబడిన జిల్లాలకు నిధులు లేవు. అమరావతికి నిధులు లేవు. పోలవరానికి నిధులు లేవు. పునర్విభజన చట్టంలో అంశాలకు పరిష్కారం లేదు. తన కేసుల మాఫీ కోసం రాష్ట్రాన్నే జగన్ రెడ్డి తాకట్టు పెట్టారు. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని నమ్మకద్రోహం చేశారు. 28 మంది వైసీపీ ఎంపీలను తన కేసుల మాఫీ కోసమే వాడుతున్నారు' అని ఆరోపించారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.


డేటింగ్ యాప్ లో నా ఫోటోలు ఉన్నాయ్..క్లారిటీ ఇచ్చిన పునర్నవి..!

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>