PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kvp982c519d-07df-40f8-93cf-e2a8e91ce8e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kvp982c519d-07df-40f8-93cf-e2a8e91ce8e8-415x250-IndiaHerald.jpgఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స‌త్తా చాటి రాజ‌కీయంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అశోక్ మాత్రం ముర‌ళీ వ‌ర్గం నిల‌బెట్టే టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి అస‌లు ముర‌ళీకి రాజ‌కీయంగా మ‌రో ఐదేళ్ల పాటు ఎలాంటి ప్లాట్ ఫాం లేకుండా చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. అటు ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ ఎమ్మెల్యే... ఇటు వైఎస్ ఫ్యామిలీ విధేయుడు, కేవీపీ బావ‌మ‌రిది మ‌ధ్య జ‌రుగుతోన్న ఆ స‌మ‌రం చింత‌ల‌పూడి రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ముర‌ళీ సొంత గ్రామం అయిన కామ‌వ‌ర‌పుకోట‌తో పాటు kvp;view;ashok;congress;mp;district;scheduled caste;scheduled tribes;village;mla;war;letter;tdp;local language;ycp;reddy;dookuduకేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?kvp;view;ashok;congress;mp;district;scheduled caste;scheduled tribes;village;mla;war;letter;tdp;local language;ycp;reddy;dookuduMon, 01 Feb 2021 12:25:00 GMTరెడ్డి ఆత్మ‌, కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు కేవీపీ రామ‌చంద్ర‌రావుకు స్వ‌యానా బావ‌మ‌రిది. త‌న బావ రాష్ట్ర, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పే నేత అయినా అశోక్ మాత్రం త‌న సొంత జిల్లా ప‌శ్చిమ గోదావ‌రి రాజ‌కీయాల బోర్డ‌ర్ దాటి రాడు. వైఎస్ ఫ్యామిలీకి ఎప్ప‌టి నుంచో వీర విధేయుడు అయిన అశోక్ ప‌శ్చిమ మెట్ట ప్రాంతంతో పాటు చింత‌ల‌పూడి వైసీపీ రాజ‌కీయాల్లో కీల‌క నేత‌గా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కామ‌వ‌ర‌పుకోట‌, లింగ‌పాలెం మండ‌లాల్లో మెజార్టీ పంచాయ‌తీల్లో అశోక్ వ‌ర్గం నేత‌లే వైసీపీ నుంచి స‌ర్పంచ్ అభ్య‌ర్థులుగా పోటీ ప‌డుతున్నారు.
అటు టీడీపీ నుంచి చింత‌ల‌పూడి మాజీ ఎమ్మెల్యే గంటా ముర‌ళీ రామ‌కృష్ణ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స‌త్తా చాటి రాజ‌కీయంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అశోక్ మాత్రం ముర‌ళీ వ‌ర్గం నిల‌బెట్టే టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఓడించి అస‌లు ముర‌ళీకి రాజ‌కీయంగా మ‌రో ఐదేళ్ల పాటు ఎలాంటి ప్లాట్ ఫాం లేకుండా చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. అటు ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ ఎమ్మెల్యే... ఇటు వైఎస్ ఫ్యామిలీ విధేయుడు, కేవీపీ బావ‌మ‌రిది మ‌ధ్య జ‌రుగుతోన్న ఆ స‌మ‌రం చింత‌ల‌పూడి రాజ‌కీయాల‌ను హీటెక్కిస్తోంది.

తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ముర‌ళీ సొంత గ్రామం అయిన కామ‌వ‌ర‌పుకోట‌తో పాటు ఈ మండ‌లంపై అశోక్, కోట‌గిరి పూర్తిగా దృష్టిపెట్టారు. 80 నుంచి 90 శాతం స్థానాల్లో గెలుపు ల‌క్ష్యంగా ముందుకు వెళుతున్నారు. మాజీ ఎమ్మెల్యేగా, ఏపీఐడీసీ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన  ముర‌ళీ మండ‌లంతో పాటు సొంత గ్రామంలో ప‌ట్టుకోసం పాకులాడాల్సిన ప‌రిస్థితి. ఏ గ్రామంలో చూసినా అశోక్ వ్య‌హాలు, దూకుడుతో ముర‌ళీ వ‌ర్గం నిస్తేజంగా ఉంది. వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేక‌పోతే అప్ప‌టిక‌ప్పుడు అశోక్ త‌న‌దైన వ్యూహంతో అప్ప‌టి వ‌ర‌కు ముర‌ళీ వ‌ర్గంగా ఉన్న నేత‌ల‌కు వైసీపీ కండువాలు క‌ప్పి అభ్య‌ర్థులుగా నిల‌బెడుతున్నారు. ఆడ‌మిల్లిలో అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ నేత‌గా ఉన్న మ‌ద్దిపాటి భీమేశ్వ‌ర‌రావును వైసీపీలోకి తీసుకురావ‌డంలో అశోక్ వ్యూహం స‌క్సెస్ అయ్యింది.

స‌వాల్ చేస్తోన్న అశోక్ :

వీరిద్ద‌రు వేర్వేరు పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుంచే తీవ్ర‌మైన వార్ ఉండేది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి కాంగ్రెస్‌లో ఉన్నా వీరి మ‌ధ్య రాజ‌కీయం వైరం పెరిగిందే త‌ప్పా త‌గ్గ‌లేదు.. త‌ర్వాత వైసీపీలో ఉన్న‌ప్పుడు ఇది కంటిన్యూ అయ్యింది. అయితే ముర‌ళీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు అశోక్‌తో పాటు ఆయన వ‌ర్గాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టార‌న్న టాక్ ఉంది. త‌న‌ను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కేందుకు నాడు చేసిన ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టి... నేడు అశోక్ కీల‌క నేత‌గా ఎద‌గ‌డంతో పాటు జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న మాట నెగ్గించుకుంటున్నారు. ముర‌ళీ ఎమ్మెల్యే అయ్యాక అశోక్ వ‌ర్గంపై ఏకంగా 155 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించి వాళ్ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టార‌న్న టాక్ ఉంది. ఆ త‌ర్వాత మ‌ద్దాల రాజేష్ ఎమ్మెల్యే అయ్యాక ఈ కేసుల గోల లేదు. ఇక ముర‌ళీ గ‌త ఏడెనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు. వీరిని మ‌రో ఐదేళ్ల పాటు అధికారానికి దూరం చేస్తే వీరిని శాశ్వ‌తంగా రాజ‌కీయ అధికారానికి దూరం చేయాల‌న్న క‌సితో అశోక్ ముందుకు వెళుతున్నారు.

ముర‌ళీ స్వ‌గ్రామంలో వైసీపీ దూకుడు ...

ముర‌ళీ సొంత పంచాయ‌తీలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగ‌రాల‌ని అశోక్‌తో పాటు ఏలూరు ఎంపీ శ్రీథ‌ర్ ప‌క్కా ప్లానింగ్‌తో ఉన్నారు. వీరిద్ద‌రు ప‌దుల సంఖ్య‌లో పంచాయ‌తీల‌పై దృష్టి పెట్టినా ముర‌ళీ సొంత పంచాయ‌తీ కామ‌వ‌ర‌పుకోట‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ అలా వ‌చ్చిందో లేదో ముర‌ళీ స్వ‌గ్రామంలో వైసీపీ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. ఇప్ప‌టికే ప‌లు వార్డుల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ప్ర‌చారం ప్రారంభించినా అటు ముర‌ళీ వ‌ర్గానికి మాత్రం ఇంకా అభ్య‌ర్థులు ఎవ్వ‌రూ దొర‌క‌ని ప‌రిస్థితి. ఇక ఇక్క‌డ టీడీపీలో పాత వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం కూడా మైన‌స్‌. మ‌రి ఈ ఆస‌క్తిక‌ర సంగ్రామంలో గెలుపు ఎవ‌రిదో ఈ 17న చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే మూడో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తేలిపోనుంది.




బడ్జెట్‌ 2021: ఈ వాహ‌నాలు అన్నీ ఇక‌ తుక్కుకే..!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>