MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood411df196-ca97-494b-95fe-5f47409ebe0f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sood411df196-ca97-494b-95fe-5f47409ebe0f-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో హీరో సోనూసూద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో భవన నిర్మాణ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. sonu sood;mumbai;maharashtra - mumbai;hosta;bollywood;high court;january;court;maharashtra;wife;hero;local language;application;supreme court;shaktiసుప్రీంకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్..!?సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాలీవుడ్ నటుడు సోనూసూద్..!?sonu sood;mumbai;maharashtra - mumbai;hosta;bollywood;high court;january;court;maharashtra;wife;hero;local language;application;supreme court;shaktiMon, 01 Feb 2021 10:00:00 GMTహీరో సోనూసూద్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో భవన నిర్మాణ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. మహారాష్ట్ర రీజనల్ మరియు టౌన్ ప్లానింగ్ చట్టం, 1966ను పరిగణనలోకి తీసుకోకుండానే జనవరి 13, 2021న బాంబే హైకోర్టు తీర్పునిచ్చినట్లు సుప్రీంకు సోనూసూద్ విన్నవించుకున్నారు.

అయితే ముంబైలోని జూహు ప్రాంతంలోని సోనూ నివాసంలో అక్రమ నిర్మాణాలపై బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నోటీసులు ఇచ్చింది. ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్‌’ భవనాన్ని హోటల్‌గా మార్చడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో బీఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా తొలుత స్థానిక కోర్టును ఆశ్రయించగా ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. జనవరి నెల మొదట్లో బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేయగా అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో సోనూసూద్ నివాసంలో అక్రమ నిర్మాణాలపై కేసు నమోదు చేయాలంటూ జూహు పోలీస్‌ స్టేషన్‌ను బీఎంసీ కోరింది. దీంతో సోనూసూద్ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

తన నివాసంలో వాణిజ్య నిర్మాణాల కోసం చేసిన దరఖాస్తును మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎంసీజెడ్‌ఎంఏ) నిబంధనలకు లోబడి మున్సిపల్ కమిషనర్ 2018లో ఆమోదించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రాంతీయ, పట్టణ ప్రణాళిక చట్టం 1966లోని సెక్షన్ 43 (1) నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా బాంబే హైకోర్టు ఈ నెల 13న తన పిటిషన్‌ను తిరస్కరించిందని తెలిపారు. పైన పేర్కొన్న సెక్షన్‌లోని నిబంధన ప్రకారం అంతర్గత పునరుద్ధరణ పనులకు ఎలాంటి అనుమతి అవసరం లేదని సోను సూద్‌, ఆయన భార్య ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఎంసీ నోటీసు నేపథ్యంలో ఆ పనులను ఆపివేశామని, అయితే ఇప్పటికే పనులు పూర్తయిన భవనాన్ని కూల్చకుండా అడ్డుకోవాలని అందులో కోరారు.




పెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహిని

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>