PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021bcda33cc-6404-4554-9abd-aa8c302ab886-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021bcda33cc-6404-4554-9abd-aa8c302ab886-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ జాతకం బాగులేదు, వాస్తు అంతకంటే బాగులేదు. అన్నిటికీ మించి రాజకీయం అసలు బాగులేదు. అందుకే ఏపీ అంటే కేంద్రానికి అసలు నచ్చడంలేదు ఇప్పటికి వరసగా ఏడు బడ్జెట్లు బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టింది. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నా నేడు జగన్ సీఎం అయినా కూడా ఏపీకి కేంద్రం ఒరగబెట్టింది ఏమీ లేదు. union budget 2021;mithra;bharatiya janata party;jagan;andhra pradesh;vishakapatnam;cm;prime minister;chief minister;central government;mantraఇంతకీ ఏపీ ఎక్కడుంది సార్...?ఇంతకీ ఏపీ ఎక్కడుంది సార్...?union budget 2021;mithra;bharatiya janata party;jagan;andhra pradesh;vishakapatnam;cm;prime minister;chief minister;central government;mantraMon, 01 Feb 2021 14:11:02 GMTఆంధ్రప్రదేశ్ జాతకం బాగులేదు, వాస్తు అంతకంటే బాగులేదు. అన్నిటికీ మించి రాజకీయం అసలు బాగులేదు. అందుకే ఏపీ అంటే కేంద్రానికి అసలు నచ్చడంలేదు ఇప్పటికి వరసగా ఏడు బడ్జెట్లు బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టింది. నాడు చంద్రబాబు సీఎంగా ఉన్నా నేడు జగన్  సీఎం అయినా కూడా ఏపీకి కేంద్రం ఒరగబెట్టింది ఏమీ లేదు.

ఏపీ అన్యాయంగా విభజించబడిన రాష్ట్రం. ఏపీ కోరుకోలేదు ఈ అడ్డగోలు  విభజన. కానీ నాటి అధికార ప్రక్షం ప్రతిపక్షం కలసి విభజించాయి. దానికి అన్ని పార్టీలు సహకరించాయి. ఇపుడు ఏపీకీ తీరని అన్యాయం జరిగింది. అయినా ఒక్క బడ్జెట్ లో కూడా ఏపీని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏపీలో అధికారం సంపాదిద్దామని ఏదో బావుకుందామని చూస్తున్న బీజేపీ నేతలు అయినా కేంద్రంతో చెప్పి నాలుగు ప్రాజెక్టులు అయినా తీసుకురాలేకపోతున్నారు.

ఇక ఏపీలో చూస్తే రాజకీయం కూడా కేంద్రంలోని బీజేపీకి బాగా కలసివస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీని మిత్ర పక్షం చేసుకుని మిగిలిన రెండు ప్రాంతీయ  పార్టీల మధ్య కయ్యాలతో కూడిన  పోటీ పెట్టి బీజేపీ చోద్యం చూస్తోంది. ఏపీకి విభజన హామీలు అలాగే పడి ఉన్నాయి. ఒక్క ప్రాజెక్ట్ కొత్తగా మంజూరు దేముడు పాతవాటికి దిక్కులేదు.

రెండేళ్ళ క్రితం స్వయంగా ప్రధాని విశాఖ వచ్చి రైల్వే జోన్ ప్రకటించారు. దానికి మూడు వేల నుంచి అయిదు వేల కోట్ల దాకా కావాలి. కానీ ఒక్క పైసా కూడా కేంద్రం మంజూరు చేయలేదు. మెట్రో రైలు ప్రాజెక్టులు అంటూ మిగిలిన రాష్ట్రాలకు కేటాయించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీ గురించి ఊసే లేదు. ఇదే కాదు కచ్చితంగా వీటిని ఇన్ని నిధులు అంటూ కేటాయించిన పాపాన పోలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడమే తప్ప మిగిలింది ఏమీ లేదు, ఇంతకీ ఏపీ ఈ దేశంలో ఉందా, అసలు ఏపీ అన్నది కేంద్ర పాలకులకు గుర్తు ఉందా. ఇదీ సగటు పౌరుడి ఆగ్రహంతో  కూడిన ఆవేదన.




బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?

కాపు వేద‌న‌: ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ, వైసీపీ కుతంత్రాల‌కు బ‌లి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>