PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda44e6d3ab-e370-4c1f-8797-666866d80c36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda44e6d3ab-e370-4c1f-8797-666866d80c36-415x250-IndiaHerald.jpgతన ఆదేశాలను అమలు చేయలేమంటూ సీఎస్ ఆధిత్యనాథ్ రాసిన లేఖపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. సీఎస్ లేఖపై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఆయన ఆసారి మరింత సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటిస్తున్నారు నిమ్మగడ్డ. nimmagadda;amala akkineni;kumaar;praveen;tiru;jagan;andhra pradesh;district;panchayati;letterనిమ్మగడ్డ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా!నిమ్మగడ్డ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా!nimmagadda;amala akkineni;kumaar;praveen;tiru;jagan;andhra pradesh;district;panchayati;letterMon, 01 Feb 2021 08:49:06 GMTపంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిసినా.. బరిలో ఉన్నఅభ్యర్థుల మధ్య పోటీ కంటే... ఎస్ఈసీ- సర్కార్ పోరాటమే రోజుకో మలుపు తిరుగుతూ కాక రేపుతోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు నిర్ణయాలతో జగన్ సర్కార్ కు షాకిస్తుండగా.. జగన్ సర్కార్ కూడా ఆయనకు పై ఎత్తులు వేస్తూనే ఉంది. తాజాగా సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రాసిన లేఖకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ బదులిచ్చారు. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరని, కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా
లేదని, కాబట్టి జారీ చేసిన ఆదేశాలను మరోమారు పరిశీలించాలని సీఎస్ తన లేఖలో ఎస్ఈసీకి తేల్చి చెప్పారు.

   ఈ నెల 23న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనకుండా జిల్లా అధికారులను ప్రవీణ్ ప్రకాశ్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఆయనను బదిలీ చేయాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖకు స్పందించిన ప్రవీణ్ ప్రకాశ్ తనపై చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను నిబంధనల మేరకే వ్యవహరించానని, పరిధి దాటలేదని స్పష్టం చేశారు. తాను ఎవరినీ నియంత్రించే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. అయితే ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలీ చేయాలని ఆదేశించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిమ్మగడ్డ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని మరో లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల అధికారి ఆదేశాలు అమలు చేయకుంటే అది కోర్టు ధిక్కరణే అవుతుందని హెచ్చరించారు. ఎస్‌ఈసీ లేఖకు స్పందించిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ప్రవీణ్ ప్రకాశ్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలో లేరు కాబట్టి చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పారు.

               తన ఆదేశాలను అమలు చేయలేమంటూ సీఎస్ ఆధిత్యనాథ్ రాసిన లేఖపై నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. సీఎస్ లేఖపై నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారనే సమాచారం వస్తోంది. దీంతో ఆయన ఆసారి మరింత  సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటిస్తున్నారు నిమ్మగడ్డ.




  


ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>