PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4c1ddb59-4290-4dad-aea1-784ca5192144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections4c1ddb59-4290-4dad-aea1-784ca5192144-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై దక్షినాది రాష్ట్రాలు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ప్రతీ ఏటా జరిగిన అన్యాయం మాదిరి గానే ఈ ఏడు కూడా బడ్జెట్ లో అన్యాయం జరగడం మనం చూసాం. ఇక దీనిపై ఏపీలో అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్ష టీడీపీ కీలక వ్యాఖ్యలు చేస్తుంది. విభజన చట్టంలో ఏపీకి సంబంధించిన విషయాలను కేంద్ర బడ్జెట్టులో ప్రస్తావించ లేదు అని అన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల. కేంద్ర బడ్జెట్టులో ఏపీని విస్మరించడం బాధాకరం అని మండిపడ్డారు. కేంద్రం ఏపీని చిన్న చూపు చూస్తోంది అని పేర్కొన్నారు. దక్షిణాదిలోని tdp;andhra pradesh;tdp;central government;ycp;mantraకేంద్రాన్ని మళ్ళీ టార్గెట్ చేసిన టీడీపీకేంద్రాన్ని మళ్ళీ టార్గెట్ చేసిన టీడీపీtdp;andhra pradesh;tdp;central government;ycp;mantraMon, 01 Feb 2021 21:30:00 GMTకేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై దక్షినాది రాష్ట్రాలు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ప్రతీ ఏటా జరిగిన అన్యాయం మాదిరి గానే ఈ ఏడు కూడా బడ్జెట్ లో అన్యాయం జరగడం మనం చూసాం. ఇక దీనిపై ఏపీలో అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్ష టీడీపీ కీలక వ్యాఖ్యలు చేస్తుంది. విభజన చట్టంలో ఏపీకి సంబంధించిన విషయాలను కేంద్ర బడ్జెట్టులో ప్రస్తావించ లేదు అని అన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల. కేంద్ర బడ్జెట్టులో ఏపీని విస్మరించడం బాధాకరం అని మండిపడ్డారు. కేంద్రం ఏపీని చిన్న చూపు చూస్తోంది అని పేర్కొన్నారు.

దక్షిణాదిలోని వివిధ రాష్ట్రాల ప్రస్తావన తెచ్చిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలని విస్మరించింది అని మండిపడ్డారు. ఏపీకి బడ్జెట్ కేటాయింపులు జరిపేలా రాష్ట్ర ప్రభుత్వం వైపు కృషి చేయలేదు అని ఆరోపణలు చేసారు. కేంద్ర బడ్జెట్టులో ఏపీని విస్మరించే పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే అని ఆయన అన్నారు. దీనికి సీఎం, మంత్రులే బాధ్యత వహించాలి అని యనమల డిమాండ్ చేసారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ కేసులు గురించి మాట్లాడారు.. వాళ్ల స్వప్రయోజనాల గురించే మాట్లాడారు అని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలోని పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులను పరిష్కరించాలని కేంద్రాన్ని ఏనాడూ కోరలేదు అని ఆయన ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైళ్లు.. పారిశ్రామిక కారిడార్ల గురించి ప్రస్తావించినా.. ఏపీ విషయంలో ఇలాంటివేవీ ప్రస్తావించ లేదు అని యనమల అన్నారు. కేసులను సెట్ రైట్ చేసుకునే ప్రయత్నమే సీఎం, మంత్రుల్లో కన్పించింది అని ఆయన అన్నారు. కేంద్ర బడ్జెట్టులో కేటాయింపుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పోరాడలేదు అని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా తెస్తామంటూ ఓట్లేయించుకున్న వైసీపీ.. ఆ తర్వాత వదిలేసింది అని ఆయన ఆరోపణలు చేసారు. పేదరిక నిర్మూలన.. సామాజిక అసమానతల తొలగింపు చర్యలపై కేంద్ర బడ్జెట్టులో ప్రస్తావన లేదు అని ఆయన విమర్శించారు.


బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>