Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ravanth-reddy5f041a5a-269b-490d-b62d-0bf674bda7da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ravanth-reddy5f041a5a-269b-490d-b62d-0bf674bda7da-415x250-IndiaHerald.jpgజమిలి ఎన్నికలు జరిగితే దేశం రెండుగా చీలిపోతుందంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అదే జరిగితే దేశ విభజన ఉద్యమం చెలరేగుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడని, దానికోసం ఆయనకు దక్షిణ భారత ఓట్లు అవసరమవుతాయని, దానికోసమే జమిలిని తెరమీదకు తెస్తున్నారని..ravanth reddy;kcr;revanth;vidya;hyderabad;narendra modi;revanth reddy;congress;prime minister;minister;central government;reddy;criminalజమిలితో దేశం రెండుగా చీలుతుంది.. రేవంత్ షాకింగ్ కామెంట్స్జమిలితో దేశం రెండుగా చీలుతుంది.. రేవంత్ షాకింగ్ కామెంట్స్ravanth reddy;kcr;revanth;vidya;hyderabad;narendra modi;revanth reddy;congress;prime minister;minister;central government;reddy;criminalMon, 01 Feb 2021 15:59:12 GMTహైదరాబాద్: జమిలి ఎన్నికలు జరిగితే దేశం రెండుగా చీలిపోతుందంటూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అదే జరిగితే దేశ విభజన ఉద్యమం చెలరేగుతుందని అభిప్రాయపడ్డారు. నగరంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీపై, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశానికి అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడని, దానికోసం ఆయనకు దక్షిణ భారత ఓట్లు అవసరమవుతాయని, దానికోసమే జమిలిని తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే.. దక్షిణ భారత ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్ష ఎన్నిక జరిగితే.. ఇక్కడి ప్రజలు ఊరుకోరని అన్నారు. ఒకవేళ దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశంగా మారుతుందని జోస్యం చెప్పారు.

మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ భారత రాష్ట్రాల ప్రాధాన్యం చాలా తగ్గిందని అన్నారు. ప్రాధాన్యం కలిగిన కేంద్ర మంత్రి పదవులను ఉత్తరాది వారికే కట్టబెడుతున్నారనిక, దక్షిణాదికి మొండిచేయి చూపిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచే అత్యధికంగా ట్యాక్స్ చెల్లింపులు జరుగుతున్నాయని, కానీ ఆ నిధులన్నీ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని, లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్‌లోనే లేవనెత్తి ఆందోళన చేస్తానని చెప్పారు.

కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా రేవంత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒకరిని మించిన వారు మరొకరని, కేంద్ర బడ్జెట్‌లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని రేవంత్ ఎద్దేవా చేశారు. గతంలో బీహార్‌కు 5 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారని.. అది ఏమైందో ఇప్పటికీ తెలియదని విమర్శించారు.

చివరిగా రైతు ఉద్యమం అణచివేతపై స్పందిస్తూ.. రైతులను అణచివేసేందుకు జాతీయ రహదారులను కిలోమీటర్ల మేర తవ్వడం దుర్మార్గమని, దీనిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ అన్నారు. రాజ్యాంగ సవరణలు చేసినప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలపై ప్రధాని మోదీపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని నిలదీశారు.




నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>