EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-kaus-chiranjeevi-nagababu12b9a468-3e4b-4777-9ac7-21f612e54875-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/janasena-pawankalyan-kaus-chiranjeevi-nagababu12b9a468-3e4b-4777-9ac7-21f612e54875-415x250-IndiaHerald.jpgసరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇది ఫక్తు కాపుల సమావేశం తప్ప మరోటికాదు. కాపుల అభివృద్ధికి, కాపులకు రాజ్యాధికారం అని, రాజకీయాలను కాపులు శాసించేస్ధాయికి చేరుకోవాలని పనవ్ చెప్పిన మాటలు దేన్ని సూచిస్తున్నాయో జనాలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు కారు. సమావేశాన్ని నిర్వహించింది కాపు నేత. సమావేశంలో పాల్గొన్నదంతా కాపులే. సమావేశంలో వాళ్ళకు దిశానిర్దేశం చేసిందీ కూడా కాపునేతే. మరి ఇది కాపుల సమావేశం కాకుండా మరేమవుతుంది. ఒకటిమాత్రం నిజం కాపులంతా కలిసి తమను ఉద్దరించే janasena pawankalyan kaus chiranjeevi nagababu;pawan;pawan kalyan;tara;bharatiya janata party;nadendla manohar;janasena;backward classes;population;janasena party;party;gajuwakaహెరాల్డ్ ఎడిటోరియల్ : మొత్తానికి పవన్ నిజస్వరూపం బయటపడిందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : మొత్తానికి పవన్ నిజస్వరూపం బయటపడిందా ?janasena pawankalyan kaus chiranjeevi nagababu;pawan;pawan kalyan;tara;bharatiya janata party;nadendla manohar;janasena;backward classes;population;janasena party;party;gajuwakaMon, 01 Feb 2021 03:00:00 GMTఇంత కాలానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిజస్వరూపం బయటపడిందా ? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ పెట్టినపుడు తనకు కులం లేదని, మతం లేదని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. తనను కాపులకు మాత్రమే పరిమితం చేయవద్దని, తాను అందరివాడనని చెప్పుకునే ప్రయత్నించారు. సరే పవన్ మాటలను జనాలు ఎంతవరకు నమ్మారన్నది వేరే విషయం. మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటి చేసిన పవన్ ఓడిపోయింది వాస్తవం. భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి కారణం ఏమిటంటే పై నియోజకవర్గాల్లో కాపు ఓట్లే మెజారిటి అన్న విషయం అందరికీ తెలిసిందే. సరే తర్వాత బీజేపీ పొత్తుపెట్టుకుని ఇఫుడు పవన్ చేస్తున్న రాజకీయాలు అందరు చూస్తున్నదే.



సరే ఇక ప్రస్తుత విషయానికి వస్తే కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇది ఫక్తు కాపుల సమావేశం తప్ప మరోటికాదు. కాపుల అభివృద్ధికి, కాపులకు రాజ్యాధికారం అని, రాజకీయాలను కాపులు శాసించేస్ధాయికి చేరుకోవాలని పనవ్ చెప్పిన మాటలు దేన్ని సూచిస్తున్నాయో జనాలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు కారు. సమావేశాన్ని నిర్వహించింది కాపు నేత. సమావేశంలో పాల్గొన్నదంతా కాపులే. సమావేశంలో వాళ్ళకు దిశానిర్దేశం చేసిందీ కూడా కాపునేతే. మరి ఇది కాపుల సమావేశం కాకుండా మరేమవుతుంది. ఒకటిమాత్రం నిజం కాపులంతా కలిసి తమను ఉద్దరించే బాధ్యతను పవన్ మీదుంచారు.



పార్టీలో పవన్ ఆత్మగా ప్రచారంలో ఉన్న మరో అగ్రనేత నాదెండ్ల మనోహర్ మాత్రం కాపుల సమావేశంలో ఎక్కడా అడ్రస్ ఎందుకులేరు ? అసలు చాలా సమావేశాలు పవన్ లేకుండా నాదెండ్లే నిర్వహించేస్తున్నారు. పోనీ నాదెండ్లకన్నా ముందునుండే పవన్ తో సన్నిహితంగా ఉన్న పార్టీలోని బీసీ నేతలంతా ఏమయ్యారు ? అంటే కాపులతో సమావేశం కాబట్టే వాళ్ళందరినీ దూరంగా ఉంచేశారన్నది స్పష్టం. మరి ఇంతోటి దానికి తాను కాపును కానని, తనను కాపులకు మాత్రమే పరిమితం చేయద్దనే ప్రకటనలు ఎందుకు ? సమాజంలో కాపుల జనాభా 27 శాతం అని పవనే చెప్పారు. కాబట్టి ముసుగు తీసేసి నేరుగానే కాపుల ఉద్ధరణకు నడుం బిగించచ్చు కదా ఇంకా నాటకాలెందుకు ? పవన్ను నమ్మే జనాలు నమ్ముతారు లేని వాళ్ళు లేదంతే.




అమ్మాయి గారు అదరగొట్టింది.. టాలీవుడ్ లో మరో లక్కీ హీరోయిన్..!

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>