PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/lady-mro-shocks-with-nimmagadda-words4a546bee-9abb-4cf2-a8a0-37f1ec014d08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/lady-mro-shocks-with-nimmagadda-words4a546bee-9abb-4cf2-a8a0-37f1ec014d08-415x250-IndiaHerald.jpgబదిలీలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు షాకుల మీద షాకులిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఓ మహిళా ఎమ్మార్వోకి చిన్న షాకిచ్చారు. ఏపీలో నిమ్మగడ్డకు ఓటు హక్కు లేదని ఆమధ్య వార్తలొచ్చాయి. తన సొంత గ్రామంలోనే ఓటరు లిస్ట్ లు తన పేరు తొలగించారంటూ ఆయన అధికారుల దగ్గర చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు సైతం నిమ్మగడ్డపై మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండే ఆయనకు ఏపీలో ఓటు హక్కు ఎందుకని నిలదీశారు. ఈ క్రమంలో ఆదివారం సొంత ఊరికి వచ్చిన నిమ్మగడ్డ ఓటు హక్కు గురించి పరోక్షంగా ప్రస్తావించారు. jagan-nimmagadda-elections;kumaar;hyderabad;district;panchayati;village;ycp;tahasildarజగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డజగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డjagan-nimmagadda-elections;kumaar;hyderabad;district;panchayati;village;ycp;tahasildarMon, 01 Feb 2021 09:00:00 GMTవైసీపీ నేతలు సైతం నిమ్మగడ్డపై మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండే ఆయనకు ఏపీలో ఓటు హక్కు ఎందుకని నిలదీశారు. ఈ క్రమంలో ఆదివారం సొంత ఊరికి వచ్చిన నిమ్మగడ్డ ఓటు హక్కు గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

ఆదివారం సాయంత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమ స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చారు. ఆయనకు తహసీల్దార్‌ మల్లేశ్వరి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడే ఉన్న తహశీల్దార్ మల్లేశ్వరిని నిమ్మగడ్డ ఇంటిలోకి ఆహ్వానించారు. ఆ సందర్భంలో ఆయన అన్నమాటలతో మహిళా ఎమ్మర్వో షాకయ్యారట. ‘ఇదే మా ఇల్లు. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. ఈ ఊళ్లోనే చదువుకున్నా. ఇక్కడ మా అమ్మ ఉంటారు. నేను అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటా’ అని తహశీల్దార్ కు తెలిపారు నిమ్మగడ్డ. అంటే తన స్వగ్రామంలో తనకు ఓటు హక్కు ఉండాల్సిన అవసరాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారని అర్థమవుతోంది. తనకి ఓటు హక్కు లేకపోవడంపై సెటైర్లు వేస్తున్న వైసీపీ నేతలకి కూడా ఆయన పరోక్షంగా జవాబిచ్చినట్టు తెలుస్తోంది.
 
దుగ్గిరాలలో తన సొంత ఇంటి వద్ద ఎస్ఈసీ నిమ్మగడ్డ దాదాపు గంటన్నరసేపు గడిపారు. వారి కుటుంబ ఆప్తుడు మల్లాది శ్యామ్‌ సుందర ప్రసాద్‌ సహా చిన్ననాటి స్నేహితులతో ఆయన ముచ్చటించారు. ఆ సందర్భంలో ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఎన్నికల విషయాలు ప్రస్తావించలేదట. కేవలం కుటుంబ అంశాలు మాత్రమే మాట్లాడారని తెలుస్తోంది. మొత్తమ్మీద తన ఓటు హక్కు, స్థానికతపై రాద్ధాంతం చేస్తున్న వైసీపీ నాయకులకు నిమ్మగడ్డ ఇలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.




ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>