EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgజ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం కాపుల‌కు ఇచ్చిన హామీల‌ను అట‌కెక్కించింద‌ని కాపు సంఘం నేత‌లు మండిప‌డుతున్నారు.ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్ట‌న బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. అయితే కేటాయింపులు అయితే జ‌రిగాయి గాని నిధుల మంజూరు కాలేదు. వాస్త‌వంలో చాలామ‌ట్టుకు ఉత్తిదే దాన‌న్న వాయిస్ కాపు సంఘం నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే పంచాయ‌తీ ఎన్jagan;cbn;amala akkineni;godavari river;ambati rambabu;ram madhav;balija;2019;district;east;east godavari;buggana rajendranath reddy;mla;minister;central government;ycp;jac;research and analysis wingహెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ కాపు స్వ‌రంలో కాక‌... జ‌గ‌న్‌పైకి నేత‌ల అస్త్రాలు...హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ కాపు స్వ‌రంలో కాక‌... జ‌గ‌న్‌పైకి నేత‌ల అస్త్రాలు...jagan;cbn;amala akkineni;godavari river;ambati rambabu;ram madhav;balija;2019;district;east;east godavari;buggana rajendranath reddy;mla;minister;central government;ycp;jac;research and analysis wingMon, 01 Feb 2021 10:18:03 GMTబుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా ప్ర‌వేశ‌పెట్ట‌న బ‌డ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. కాపుల సంక్షేమానికి రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు.  అయితే కేటాయింపులు అయితే జ‌రిగాయి గాని  నిధుల మంజూరు కాలేదు. వాస్త‌వంలో చాలామ‌ట్టుకు ఉత్తిదే దాన‌న్న వాయిస్ కాపు సంఘం నేత‌ల నుంచి వినిపిస్తోంది. అయితే పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాపు సంక్షేమం అంశం కీల‌కంగా మారింది.


ఆదివారం  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో కాపు నేతల భేటీ నిర్వహించారు. ఈసంద‌ర్భంగా వారు కాపుల అభ్యున్నతి కోసం ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని చెప్పిన జగన్‌ ఆ హామీని కూడా నిలబెట్టుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలగ, కాపు, బలిజ, ఒంటరి కులాలలో నెలకొన్న పేదరికం, ఆర్థిక అసమానతల నిర్మూలనకు కేంద్రం కల్పించిన 10%  రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కేంద్రం 10%  రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2019-20లో జీవో నెంబర్‌ 60 పేరిట కేవలం విద్యావకాశాలకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింపచేస్తామని, ఉద్యోగ రంగాల్లో కుదరదని ఉత్తర్వుల్లో పేర్కొనడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.


 రిజర్వేషన్ల అమల కోసం సీఎం జగన్‌ సబ్‌ కమిటీ వేశారని దీనిలో మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులు ఉన్నారని... ఇప్పటి వరకు వీరు ఏం చేశారని ప్రశ్నించారు. త్వరలోనే వీరికి కాపుల సమస్యలు వివరిస్తామని నేతలు చెప్పారు. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాపుల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ కాపునేస్తం పథకంతో ఆ వ‌ర్గాన్ని ఆక‌ర్షించేందుకు య‌త్నిస్తున్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గానికి చెందిన  45 ఏళ్ల నుంచి 60ఏళ్ల లోపు అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని సీఎం వైఎస్ జ‌గ‌న్ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 2,35,873 మంది కాపు మహిళలకు ల‌బ్ధి చేకూరుతుంద‌న్న ప్ర‌చారం చేస్తున్నారు.




ఒకే ఒక్క కరోనా కేసు.. అయినా లాక్ డౌన్.. ఎక్కడో తెలుసా..?

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>