PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/internationala0568583-f846-4b7e-a7d3-f0be0012bb1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/internationala0568583-f846-4b7e-a7d3-f0be0012bb1f-415x250-IndiaHerald.jpgపేరుకే సోషలిజం, కమ్యూనిజం భావాలను అనుసరిస్తున్నట్లుగా ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా తీరు. వాస్తవ పరిస్థితులను చూస్తే మాత్రం చైనా తీరు అందరికీ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జిన్‌జియాంగ్‌ అనే ప్రాంతంలోని మైనార్టీ వర్గం వీగర్‌ ముస్లింల పట్ల చైనా తన దౌర్జన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ వర్గం పట్ల యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా.. తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా ధ్రువీకరించిందిveegar;education;naga chaitanya;american samoa;smart phone;government;media;audio;local language;agnyaathavaasiముస్లిం మైనారిటీ వర్గం 'వీగర్' పట్ల మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా...ముస్లిం మైనారిటీ వర్గం 'వీగర్' పట్ల మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా...veegar;education;naga chaitanya;american samoa;smart phone;government;media;audio;local language;agnyaathavaasiMon, 01 Feb 2021 21:10:00 GMTపేరుకే సోషలిజం, కమ్యూనిజం భావాలను అనుసరిస్తున్నట్లుగా ఉంటుంది డ్రాగన్ కంట్రీ చైనా తీరు. వాస్తవ పరిస్థితులను చూస్తే మాత్రం చైనా తీరు అందరికీ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. జిన్‌జియాంగ్‌ అనే ప్రాంతంలోని మైనార్టీ వర్గం వీగర్‌ ముస్లింల పట్ల  చైనా తన దౌర్జన్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ వర్గం పట్ల యథేచ్చగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న చైనా.. తాజాగా అక్కడి విద్యా సంస్థల్లో బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా ధ్రువీకరించింది. వీగర్‌ ముస్లిం జనాభాను గణనీయంగా తగ్గించేందుకు చైనా చేయని ప్రయత్నం లేదు. వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ, ఆ వర్గాల మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకోవాలని, లేదంటే సంతాన నిరోధక పరికరాలు వాడాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు ఓ పరిశోధన బైటపెట్టింది. ముస్లింలను క్యాంపుల్లో నిర్బంధిస్తున్నారని చైనా ప్రభుత్వంపై అనేక ఆరోపణలున్నాయి. చదువు, విజ్జానాన్ని పెంపొందించాలనే పేరుతో దాదాపు 10 లక్షల మంది వీగర్‌ తెగకు చెందిన మైనారిటీ ముస్లింలను చైనా ప్రభుత్వం నిర్బంధంలో పెట్టిందనే ప్రచార జరిగింది.




జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ విమర్శించిన అమెరికా.. వీటికి నిరసనగా అక్కడి ఉత్పత్తుల దిగుమతిపైనా నాటి అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, స్వయం ప్రతిపత్తి కలిగిన షిన్‌జియాంగ్‌ ప్రాంత ప్రజలు రెండు భాషలను నేర్చుకునే సౌలభ్యం ఉంది. స్థానిక బోధనా భాషగా ఉన్న వీగర్‌ను తాజాగా తొలగించినట్టు బయటపడింది. అంతేకాదు, విద్యా సంస్థల్లో ఆ భాషను కూడా మాట్లాడకుండా మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్టు తెలుస్తోంది. కెల్పిన్ కౌంటీలోని ఓ వీగర్ విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ అక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది. ‘ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో అజ్ఞాతవాసి బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్‌కు ఫోన్ చేసి, తన పొరుగింటి వ్యక్తి పిల్లలు నిర్బంధ శిబిరంలో ఉన్నారని వారిని పాఠశాలలో ఎలా చేర్పించాలని అడిగాడు... అవతలి వ్యక్తి కెల్పిన్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ ఉద్యోగిగా తనను తాను పరిచయం చేసుకుని. ఐదు, ఏడేళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలను బ్యూరో కార్యాలయాలకు తీసుకురావాలని చెప్పాడు. పిల్లలు ఏ భాషలో చదువుతారో స్పష్టం చేయమని కాలర్ అడిగినప్పుడు.. బ్యూరో ఉద్యోగి ‘జాతీయ భాష’ లేదా మాండరిన్ చైనీస్ భాషలో నిర్వహిస్తారని సమాధానం ఇచ్చాడు’ ఒకవేళ వీగర్ భాషలో సూచనలు ఇస్తారని అని అడిగితే, జాతీయ భాష ప్రమాణికం అని బదులిచ్చాడు. ఇప్పటికే నిర్భంధ క్యాంపుల్లో కాలం వెల్లదీస్తోన్న వీగర్‌‌లకు తాజాగా నిర్ణయం మరింత ఇబ్బంది కలిగించే పరిణామం అని అక్కడి హక్కుల కార్యకర్తలు, సామాజిక, స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. షిన్‌జియాంగ్‌‌లోని మైనారిటీలను మారణ హోమానికి గురిచేస్తున్నట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ కమిషన్‌ తాజా నివేదిక వెల్లడించింది. సెన్సార్‌షిప్‌, బెదిరింపు ధోరణి, అణచివేత విధానాలతో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే ఎన్నో చర్యలను చైనా తీసుకున్నట్లు ‘కాంగ్రెషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ ఆన్‌ చైనా (CECC)’ నివేదిక పేర్కొంది.




ఫిబ్ర‌వ‌రి 2వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా.?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>