MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shiyaaji-shinde9bdecf24-e494-4e46-987c-542bd1841953-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shiyaaji-shinde9bdecf24-e494-4e46-987c-542bd1841953-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి వేరే భాషల నుండి వచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో షియాజీ షిండే ఒకరు. చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ద్వారా విలన్ గా పరిచయం అయ్యి, మొదటి సినిమాతోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని, అందరిని ఆశ్చర్యపరిచిన ఈ మరాఠి వాసి ఇప్పటికీ, అవకాశాలు దక్కించుకుంటూ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరాఠీకి చెందిన వ్యక్తి తెలుగు ఎలా మాట్లాడగలడు అని అనుకున్న సమయంలో చక్కగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. షియాజీ షిండే తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఇపshiyaaji shinde;education;watch;chiranjeevi;jeevitha rajaseskhar;tollywood;రాజీనామా;cinema;tamil;villageమూడు సంవత్సరాల పాటు నైట్ వాచ్ మెన్ గా పని చేశాను : షియాజీ షిండే..మూడు సంవత్సరాల పాటు నైట్ వాచ్ మెన్ గా పని చేశాను : షియాజీ షిండే..shiyaaji shinde;education;watch;chiranjeevi;jeevitha rajaseskhar;tollywood;రాజీనామా;cinema;tamil;villageMon, 01 Feb 2021 15:02:00 GMTచిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా ద్వారా విలన్ గా పరిచయం అయ్యి, మొదటి సినిమాతోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని, అందరిని ఆశ్చర్యపరిచిన ఈ మరాఠి వాసి ఇప్పటికీ, అవకాశాలు దక్కించుకుంటూ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరాఠీకి చెందిన వ్యక్తి తెలుగు ఎలా మాట్లాడగలడు అని అనుకున్న సమయంలో చక్కగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  షియాజీ  షిండే తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, ఇప్పుడు మన ముందు స్టార్ నటుడిగా ఎదిగాడు.

పూర్తి  వివరాల్లోకెళ్తే మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని చిన్న గ్రామం. తల్లిదండ్రులిద్దరూ రైతు కుటుంబానికి చెందిన వారు. నలుగురు అక్క చెల్లెలు ఒక సోదరుడితో పెద్ద కుటుంబాన్ని నెట్టుకొచ్చే వారు షియాజీ అమ్మానాన్న. ఏడవ తరగతి వరకు తన గ్రామంలోని చదువుకున్న షిండే ఆ తర్వాత పదోతరగతి దాకా చెల్లి ఇంట్లో ఉండి పూర్తిచేశారు. 10 పూర్తి చేశాక డీఎడ్ కోర్సు కంప్లీట్ చేసి, టీచర్ కావాలనేది ఆయన లక్ష్యం. అది పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవాలి అంటే అందుకు డబ్బులు కావాలని గుర్తించి, ఉన్న విద్యార్హతను ఆధారంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా చేరాడు.

ఇక రాత్రిపూట వాచ్ మెన్  గా వ్యవహరించడం, పగలు కాలేజీకి వెళ్లడం ఇలా నిరంతరం కొనసాగించేవాడు. అయితే షియాజీ షిండే కు నటుడు కావాలనే ఆసక్తి ఎంతగానో ఉండేది. అయితే తను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు కారణంగా నటుడు కాలేనన్న భయంతో, అన్నింటికీ రాజీనామా చేసేసి,1982 లో ముంబయ్ వెళ్ళిపోయాడు.  అక్కడ తనను తాను మెరుగు పరుచుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 1997వ సంవత్సరంలో ఒక మరాఠీ సినిమాలో  అవకాశం దక్కించుకున్నాడు.

ఇలా ఒక ఐదు సంవత్సరాలు కష్టపడ్డాక బాలీవుడ్లో 2000 సంవత్సరం లో ఛాన్స్ దొరికింది. ఆ తర్వాత తమిళ్,తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూ,కోరుకున్న దిశగా తన జీవిత ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ లో ఠాగూర్  సినిమాలో నటించిన తర్వాత  షియాజీ షిండే  కు విలన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి.




ప్రేమ పేరుతో మోసం.. షాక్ ఇచ్చిన పోలీసులు..!!

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>