Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7262269-4533-4d6a-99bf-f3942bd72d86-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb7262269-4533-4d6a-99bf-f3942bd72d86-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్ లో మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ ను తన సారథ్యంలో ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి తన మిస్టర్ కూల్ కెప్టెన్సీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతేకాదు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మహేంద్రసింగ్ ధోని ఎన్నోసార్లు ఆదుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వికెట్లు వెనకాల ఉండి రెప్పపాటు సమయంలో వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇలాdhoni;ms dhoni;tara;varsha;cricket;imran tahir;chennai;mister;santoshamధోనికి మనం చెప్పాల్సిన పనిలేదు.. అతనికి తెలుసు..?ధోనికి మనం చెప్పాల్సిన పనిలేదు.. అతనికి తెలుసు..?dhoni;ms dhoni;tara;varsha;cricket;imran tahir;chennai;mister;santoshamMon, 01 Feb 2021 09:30:00 GMTక్రికెట్ లో మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ ను తన సారథ్యంలో ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి తన మిస్టర్ కూల్ కెప్టెన్సీతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అంతేకాదు జట్టు  క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మహేంద్రసింగ్ ధోని ఎన్నోసార్లు ఆదుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో వికెట్లు వెనకాల ఉండి  రెప్పపాటు సమయంలో వికెట్లు పడగొట్టి  అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇలా అన్ని విషయాల్లో కూడా మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. క్రికెట్ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు



 అయితే మహేంద్రసింగ్ ధోని గురించి ఎవరిని అడిగినా కూడా ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్ అంటూ సమాధానం చెబుతారు. ధోనీ కెప్టెన్సీలో ఆడటం అదృష్టంగా భావిస్తారు ఎంతో మంది ఆటగాళ్లు. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ధోనీ సారథ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ  క్రీడా సంస్థ తో మాట్లాడిన ఇమ్రాన్ తాహిర్ ధోని  సారథ్యం ఎంతో గొప్పది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ సారథ్యంలో ఆడేందుకు తాను ఎంతగానో ఇష్టపడతానని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ అమోఘమైన వ్యక్తి అంటూ ఆకాశానికి ఎత్తేశాడు ఇమ్రాన్ తాహీర్.



 ధోనీ సారథ్యంలో ఆడటాన్ని తన అదృష్టంగా భావిస్తానని..  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ధోనీతో కలిసి మూడేళ్లుగా ఆడుతున్న.. అందుకు  ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ధోని ఒక గొప్ప సారది మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి అని ప్రతి ఒక్కరికి ఎంతో బాగా అర్థం చేసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. అందరికీ ఎంతో అమితమైన గౌరవం ఇస్తాడు అని అందుకే ధోనీ అంటే అందరికీ ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.  ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ సారధి అని అతనికి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ ఉండదు బౌలర్లకు కు అనుకూలంగా ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలో  బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ తాహీర్.


రాగి చెంబులోని నీటిని తాగుతున్నారా..? అయితే ఇది మీకోసమే..!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>