LifeStyleParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/its-poetic-charismatic-creation-compared-to-sacred-yagna-eeb761c1-fe07-4d89-95ea-7d9dfb4d9489-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/its-poetic-charismatic-creation-compared-to-sacred-yagna-eeb761c1-fe07-4d89-95ea-7d9dfb4d9489-415x250-IndiaHerald.jpgకధా సందర్బాను సారంగా, దెవ గురువైన బృహస్పతి, తన ధర్మపత్ని తారాదేవికి, పాతివ్రత్య ధర్మాలను ఉపన్యసిస్తాడు. ఆ దెబ్బకు సనాతన చాందసంపై తారకు విరక్తి కలుగుతుంది. పర్యవసానంగా - తనపతి ప్రియ శిష్యుడైన చంద్రుని - పై మనసుపడి అతనిని విడనాడుతుంది. ఒకసారి దేవగురువు బృహస్పతి, దేవేంద్రుని ఆదేశానుసారం అమరావతిలో ఒక మహోన్నత యజ్ఞాన్ని నిర్వహించటానికి బయలుదేరే సమయములో తన భార్యకు “మగడూరలేనప్పుడు పత్ని ఏలా ఉండాలో” ఉపదేశం చేస్తాడు. తార ఏమో విలాసినీమణి, రూపలావణ్యవతీ , నవనవోన్వెషిణీ, యవ్వనోద్భాషిని. ఉరకలెత్తే యవ్వన సంtara sasankudu;women;soundarya;amrutha;dharma;tara;vedhika;gold;letter;stree;v;shaktiపెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహినిపెద్దలకు మాత్రమే: "తారా శశాంకం" గ్రంధంలోని ఒక పద్యంలో ప్రవహించిన శృంగార రసవాహినిtara sasankudu;women;soundarya;amrutha;dharma;tara;vedhika;gold;letter;stree;v;shaktiMon, 01 Feb 2021 20:00:00 GMTభారతీయ ప్రభందకావ్యాల్లో శృంగారాన్ని రసవత్తరంగా చిత్రించిన కవుల్లో “శేషము వేంకటపతి” ప్రథముడు అని చెప్పవచ్చు. ఆయన రచించిన అద్భుత మేలిమి శృంగార రసవాహినితో నిండిన గ్రంధమే "తారా-శశాంకము" పద్దెనిమిదవ శతాభ్ద కాలములో ఈ గ్రందాన్ని కొంతకాలం నిషేదించారు. 



విజ్ఞుల వాదనలు, ప్రతివాదనల అనంతరం ఈ గ్రంధమును “పండితులు మాత్రమే  చదవ తగిన గ్రంధం”  (Scholar’s Edition) గా పరిగణించారు. ఆధునిక తరం రచయితలలో విప్లవాత్మక రచనలు చేసిన గుడిపాటి వేంకటాచలం ఉరఫ్ చలం సృష్టించిన 'స్త్రీ' కంటే కూడా ముందు తరం ప్రౌడ వనిత అనదగిన తార, ఈ గ్రంధంలో కధానాయకి.



నాడే, ధర్మ వివాహాన్ని కాదని సహజప్రేమని ప్రతిపాదిస్తుంది చలం సృష్టించిన 'స్త్రీ' లో లాగ తార. ‘ఆవిష్కృత శృంగారత’ ఈ గ్రంధంలో పరిమళింప జేసింది పరిమళాల్ని విరింపచేసి వెదజల్లింది . 



కధా సందర్బాను సారంగా, దెవ గురువైన బృహస్పతి, తన ధర్మపత్ని తారాదేవికి, పాతివ్రత్య ధర్మాలను ఉపన్యసిస్తాడు. ఆ దెబ్బకు సనాతన చాందసంపై తారకు విరక్తి కలుగుతుంది. పర్యవసానంగా - తనపతి ప్రియ శిష్యుడైన చంద్రుని - పై మనసుపడి అతనిని విడనాడుతుంది.



ఒకసారి దేవగురువు బృహస్పతి, దేవేంద్రుని ఆదేశానుసారం అమరావతిలో ఒక మహోన్నత యజ్ఞాన్ని నిర్వహించటానికి బయలుదేరే సమయములో తన భార్యకు “మగడూరలేనప్పుడు పత్ని ఏలా ఉండాలో”  ఉపదేశం చేస్తాడు. తార ఏమో విలాసినీమణి, రూపలావణ్యవతీ , నవనవోన్వెషిణీ, యవ్వనోద్భాషిని. ఉరకలెత్తే యవ్వన సంపదతో మిసమిసలాడే సౌందర్య రసికశిఖామణి. ఇక బృహస్పతి ముదివయసులో శక్తి సమస్తం జావ గారి ఉడిగిపోయినవాడు.



బృహస్పతి చెప్పిన పాతివ్రత్య ధర్మాలను, ఉవ్వెత్తున ఎగిసి పడే శృంగార కడలి తరంగం తార దూది పింజలను చెదరగొట్టినట్లు చెదరగొడుతూ  “సరస శృంగారం కూడా ఒక మహోన్నత యజ్ఞమే”  అని దేవగురువు బృహస్పతి వివరించిన సందర్భంలో “ప్రవచించిన చెంపక మాల” ఈ పద్యం.



ప్రతిపదార్ధ సహితంగా వివరించాను. పఠించి పరవశించండి.


గళ రవ మంత్రముల్ సెలగగా, జిగి సిబ్బెపు గుబ్బ చన్నుల

స్కలశము లంది ఉండి, జఘనం బను వేదిక నొండి ఉండి యు

జ్వల రశనన్, గ్రహించి, జిగి వాతెఱ సోమరసంబుగ్రోలు వే

డ్కలు గల మన్మధ క్రతువు కన్నను, వేఱొక జన్న మున్నదే?"


“జఘనమనే యజ్ఞవేదికపై సరస శృంగార రసాస్వాదనలో ఉన్న దంపతులు సాగించే కార్యమే మన్మధ క్రతువు. ఆ సమయంలో ఆ జవ్వని స్వరము నుంచి వెలువడే సుస్వర ద్వనులే వేదఘొష, వేదమంత్రాలు. జిగి, బిగి కలిగి బోర్లించిన బంగారు పాత్రల వలే ప్రత్యేక శోభతో విలసిల్లే ఉన్నత వక్షోజాలే యజ్ఞ కలశాలు. శృంగార శోభతో ప్రజ్వరిల్లే ఆ జవ్వని అధరాలనుండి పురుషుడాస్వాదించే అధరామృతమే సోమరసం. విందు, వినోదం, ఉల్లాసం, ఉత్తేజం, ఉత్సాహంతో ఆ మిధునం సాగించిన ఆ రతీ మన్మధ కేళే ఒక మహోన్నత యజ్ఞం. బంగారంలాంటి శృగారం కంటే ఉన్నతమైన యజ్ఞమున్నదా?”


అంటూ సరస, విలాస, సౌందర్యవతి  తార బృహస్పతిని ప్రశ్నించింది.



కావాలంటే పద విభజన సహితంగా ప్రతిపదార్ధం

గళ రవ = గొంతు నుండి ద్వనించే అదో రకమైన మత్తైన శబ్ధం  
మంత్రముల్ సెలగగ  =  వేదఘోషలా ప్రజ్వరిల్లగా 



జిగి  = బిగువైన (ప్రత్యేక శోభ, కాంతితో )

సిబ్బెపు = బోర్లించిన గిన్నెలలాంటి

గుబ్బ = బలమైన, ఏత్తైన రూపం  

చన్నులన్ = వక్షోజములు

కలశము = పిరమిడ్ ఆకార పాత్ర

అంది = పొంది -

ఉండి = కలిగినదై - 



జఘనం = నడుము చూట్టూ ఉన్న పిరుదులు, తొడలప్రాంతము

అను = అనే-

వేదిక = విశాలమైన రంగస్థలం (యజ్ఞస్థలము)

అంది= పొంది

ఉండి=కలిగి



ఉజ్వల = శృంగార శోభతో

రశనన్ = రుచి, పరిమళం

గ్రహించి = పొంది, స్వీకరించి- 

జిగి =  ప్రత్యేక శోభ, కాంతితో

వాతెఱ = అధరం, పెదవి

సోమరసం= అమృతం

గ్రోలి= తాగి, అనుభవించి, ఆస్వాదించి



వేడ్కలు = పండుగలు విందు, వినోదం

గల=కలిగిన

మన్మధ క్రతువు=  మైదునం అనే కార్యం - స్త్రీ పురుష సంభోగం (మెటింగ్)
మించిన = గొప్పదైన

జన్నము = యజ్ఞము

ఉన్నదే = ఉన్నదా! 









బీబీ 3 రిలీజ్ డేట్‌పై ఆ హీరో ఫ్యాన్స్ ట్రోలింగ్‌... బాల‌య్య కావాల‌నే చేశాడా ?

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>