SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-tdp-panchayat-elections-nimagadda-ycp-jagand04c446b-05eb-4c91-ac1f-5ea9379134b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/naidu-tdp-panchayat-elections-nimagadda-ycp-jagand04c446b-05eb-4c91-ac1f-5ea9379134b8-415x250-IndiaHerald.jpgఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడో చోట గొడవలు జరుగుతునే ఉంటాయన్నది వాస్తవం. గ్రామాల్లో ఎవరిది పై చేయి అయితే ప్రత్యర్ధులు లొంగిపోవాల్సిందే తప్ప వేరే దారిలేదు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే పద్దతిలో జరిగాయి. స్ధానికసంస్ధల ఎన్నికల్లో గొడవలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మొదలైనట్లు చంద్రబాబు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. పైగా ధైర్యంగా ఎదుర్కోవాలంటూ గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబేమో హైదరాబాద్ లోని తనింట్లో సేఫnaidu tdp panchayat elections nimagadda ycp jagan;cbn;tara;tiru;hyderabad;telugu desam party;korcha;telugu;police;industry;ycp;lokesh kanagaraj;father;nijam;partyహెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?naidu tdp panchayat elections nimagadda ycp jagan;cbn;tara;tiru;hyderabad;telugu desam party;korcha;telugu;police;industry;ycp;lokesh kanagaraj;father;nijam;partyMon, 01 Feb 2021 07:00:00 GMT

నిజంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. అదేదో సినిమాలో బాస్ తన అనుచరులకు కనబడకుండా ఎక్కడ నుండో ఆదేశాలు ఇస్తున్నట్లుగా ఉంటోంది చంద్రబాబు వ్యవహారం కూడా. ఆదివారం నేతలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్సుకు 175 నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు, ఇన్చార్జీలు, నేతలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎటువంటి ప్రలోబాలకు దిగినా, ఎంతటి బెదిరింపులకు పాల్పడినా ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపిచ్చారు. బైండోవర్ కేసులు పెట్టినా ఏమాత్రం లెక్క చేయద్దన్నారు. ఇపుడు గనుక అధికారపార్టీ నేతల ఒత్తిళ్ళకు లొంగిపోతే గ్రామాలన్నీ వల్లకాడులాగ మారిపోతుందంటూ తీవ్రంగా హెచ్చరించారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానికసంస్ధల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడో చోట గొడవలు జరుగుతునే ఉంటాయన్నది వాస్తవం. గ్రామాల్లో ఎవరిది పై చేయి అయితే ప్రత్యర్ధులు లొంగిపోవాల్సిందే తప్ప వేరే దారిలేదు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే పద్దతిలో జరిగాయి. స్ధానికసంస్ధల ఎన్నికల్లో గొడవలు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మొదలైనట్లు చంద్రబాబు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. పైగా ధైర్యంగా ఎదుర్కోవాలంటూ గట్టిగా చెబుతున్నారు. చంద్రబాబేమో హైదరాబాద్ లోని తనింట్లో సేఫ్ గా కూర్చుని ఆదేశాలిస్తున్నారు. మరి నేతలేమో గ్రామాల్లో అధికారపార్టీ నేతలను ఢీకొనాలా ? కేసులు పెట్టించుకోవాలా ? తమ్ముళ్ళు దేనికీ భయపడద్దని ధైర్యం చెప్పటమొకటి.



ఏం నామినేషన్లు దాఖలు చేసే గ్రామాల్లో ఎక్కడోచోట చంద్రబాబు, కొడుకు లోకేష్ ఎందుకు హాజరవ్వటం లేదు ? తండ్రి, కొడుకులు గ్రామాల్లో నేతలతో పాటు తిరిగితే మిగిలిన గ్రామాల్లోని నేతలకు నైతిక మద్దతు ఇచ్చినట్లవుతుంది కదా. తనింట్లో హ్యాపీగా కూర్చుని మిగిలిన నేతలను మాత్రం కేసులు పెట్టించుకోండి, వైసీపీ నేతలను ధైర్యంగా ఎదుర్కోండి అంటే నేతలకు ఏమైనా పిచ్చా ? ఇఫుడు కేసులు పెట్టించుకుంటే జైళ్ళకు లేదా పోలీసుస్టేషన్లకు ఎవరు తిరుగుతారు ? ఒకసారి కుటుంబ పెద్ద జైలుకు పోతే ఆ కుటుంబానికి దిక్కెవరు ? ఇవన్నీ ఆలోచించుకునే చంద్రబాబు హైదరాబాద్ లో  కూర్చుని ఎన్ని కతలు చెబుతున్నా క్షేత్రస్ధాయిలో నేతలు మాత్రం తాము చేయగలిగింది మాత్రమే చేస్తున్నారంతే.




వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

జగడ్డ : కోర్టు దిక్కరణ పిటిషన్ తప్ప మరో దారి లేదు.. నిమ్మగడ్డ వార్నింగ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>