PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/latest-news5e78fb2f-2d0c-4ee4-889e-e68990884bd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/latest-news5e78fb2f-2d0c-4ee4-889e-e68990884bd3-415x250-IndiaHerald.jpgలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వేగవంతగా జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఆయనప్పటికి ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అసహనంగానే ఉందని చెప్పాలి. జగనోరి ప్రభుత్వానికి , ఎన్నికల కమిషనర్ కు మద్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకరి పై ఒకరు వరుస లేఖలతో హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో జగనోరి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పథకం కు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 1 వ తేదీననే ప్రారంభం కావలసిన ఈ పథకం ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పేదలకlatest news;amala akkineni;kumaar;jagan;high court;panchayati;february;letter;qualificationజగడ్డ : డోర్ డెలివరీని నిమ్మగడ్డ అడ్డుకోగలడా..??జగడ్డ : డోర్ డెలివరీని నిమ్మగడ్డ అడ్డుకోగలడా..??latest news;amala akkineni;kumaar;jagan;high court;panchayati;february;letter;qualificationMon, 01 Feb 2021 10:00:00 GMTఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వేగవంతగా జరుగుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయినప్పటికి   ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అసహనంగానే ఉందని చెప్పాలి. జగనోరి ప్రభుత్వానికి , ఎన్నికల కమిషనర్ కు మద్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకరి పై ఒకరు వరుస లేఖలతో హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో జగనోరి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి రేషన్ పథకం కు బ్రేక్ పడింది. ఫిబ్రవరి 1 వ తేదీననే ప్రారంభం కావలసిన ఈ పథకం ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. వాస్తవంగా ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతుంది. 

ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే ఈ పథకం పై ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. ఈ పథకం పై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది.   పంచాయితీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలనీ ఇటీవల ఎస్ఈసి రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. అయితే ఎస్ఈసి కి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ లేఖ రాసింది. ఆ లేఖలో ఈ పథకం పలు విషయాలను ప్రస్తావించింది. ఈ పథకం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం కాదని, గత ఏడాది కాలంగా ప్రయోగాత్మకంగా అమలులో ఉందని తెలిపింది. 

పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో ప్రస్తావించింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఈ పథకం అమలు పరిచేందుకు అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. అయితే రేషన్ వాహనాలపై జగన్ చిత్రాలు ఉండడంతో ఎన్నికల ప్రచారంగా మారే అవకాశం ఉందని, ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. మరి జగనోరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం హైకోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.


విషాదం : పోలియో చుక్కలు వేసుకున్న పది నిమిషాలకే చిన్నారి మృతి..?

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!

ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>