PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఈయ‌న‌కు వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఓ ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రానికి బాధ్యుడిగా ఉన్న నాయ‌కుడి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో మంత్రిగారి మాట‌ల‌ను ప‌ట్టించుకోవ డం లేదు. త‌న‌దైన ఎన్నిక‌ల కోడ్‌ను అమ‌లు చేస్తూ.. మంత్రి వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యం మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజుకు తెలిసి కూడా ఇప్పుడు ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డే ప‌రిస్థితి లేద‌ని.. ఏదైనా జ‌రిగితే.. అధిష్టానం ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌పై సీరియ‌స్‌గా ఉంద‌ని.. సో.. మ‌నకే ఇబ్బంద‌ని ఊర‌డిస్తున్నార‌ట‌. అంతేత‌ప్ప‌.. అంత‌కు మించి ఒక్క అడుగు కూడాysrcp;tiru;minister;letterఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?ఆ మంత్రికి చుక్క‌లు చూపిస్తున్న కేడ‌ర్‌... అద‌ను చూసి దెబ్బ‌కొట్టిందే ?ysrcp;tiru;minister;letterMon, 01 Feb 2021 08:20:21 GMTఅంతా నాదే.. అన్నీ నేనే.. నేను చెప్పిందే.. జ‌రుగుతుంది. జ‌ర‌గాలి! అనే మంత్రికి ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో కేడ‌ర్ హ్యాండి స్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజుకు పంచాయ‌తీ ఎన్నిక‌లు అగ్ని ప‌రీక్ష‌గా మారాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గం ఆచంట‌తోపాటు.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వేలు పెట్టారు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఏం జ‌ర‌గాల‌న్నా.. త‌న మాట ప్ర‌కార‌మే జ‌ర‌గాల‌ని నిర్ణ‌యించారు. దీంతో విధిలేక‌.. నాయ ‌కులు కూడా స‌ర్దుకు పోయారు. అయితే.. మ‌రోవైపు మంత్రి వైఖ‌రిపై తీవ్ర అసంతృప్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే నామినేష‌న్ల తొలి ద‌శ కూడా ప్రారంభ‌మైంది. దీంతో త‌న‌వారికి, త‌న‌కు మ‌ద్ద‌తుదారులుగా ఉన్న‌వారికి అవ‌కాశం ఇప్పించుకోవాల‌ని మంత్రిగారు నిర్ణ‌యించు కున్నారు. కానీ, మంత్రిగారిపై వ్య‌తిరేకంగా గ్రూపు క‌ట్టిన మ‌రో కీల‌క నాయ‌కుడు, క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికే చెందిన నేత‌.. ఒక‌రు గ్రామాల్లో తిష్ట‌వేశారు. అంతా తానే అయి చ‌క్రం తిప్పుతున్నారు. ఈయ‌న‌కు వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఓ ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రానికి బాధ్యుడిగా ఉన్న నాయ‌కుడి అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. దీంతో మంత్రిగారి మాట‌ల‌ను ప‌ట్టించుకోవ డం లేదు.

త‌న‌దైన ఎన్నిక‌ల కోడ్‌ను అమ‌లు చేస్తూ.. మంత్రి వ‌ర్గాన్ని ప‌క్క‌న పెట్టారు. ఈ విష‌యం మంత్రి శ్రీరంగ‌నాథ‌రాజుకు తెలిసి కూడా ఇప్పుడు ఎవ‌రితోనూ గొడ‌వ‌ప‌డే ప‌రిస్థితి లేద‌ని.. ఏదైనా జ‌రిగితే.. అధిష్టానం ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌పై సీరియ‌స్‌గా ఉంద‌ని.. సో.. మ‌నకే ఇబ్బంద‌ని ఊర‌డిస్తున్నార‌ట‌. అంతేత‌ప్ప‌.. అంత‌కు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక పోతున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి అంటే.. గుస్సాగా ఉన్న‌నాయ‌కులు కూడా ఇప్పుడు మంత్రిపై ఒక‌ర‌కంగా తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన నాయ‌కుడికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. దీంతో మంత్రి అనుచ‌రుల‌ను గ్రామాల్లోకి కూడా రాకుండా క‌ట్ట‌డి చేస్తున్నార‌ని.. క‌నీసం మంత్రిగారి ఫోన్‌ల‌కు కూడా కేడ‌ర్ స్పందించ‌డం లేద‌ని స‌మాచారం. మొత్తంగా ఈ ప‌రిణామం.. స‌ద‌రు వృద్ధ మంత్రికి ఎస‌రు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>