PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021-5e23ea32-41c4-4820-b203-76742d5938dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-2021-5e23ea32-41c4-4820-b203-76742d5938dd-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వీధుల్లోకి రారు. తిరుగుబాటు చేయరు. చాలా సైలెంట్ గా ఎవరి వ్యాపకాల్లొ వారు ఉంటారు. ఎన్నికల్లో కోపం వస్తే చేసేది ఏముంది నోటా కంటే తక్కువ ఓట్లు ఇస్తారు. అంతేగా. మరి ఇలాంటి ధీమాలతోనే ఏపీని కేంద్రంలోని పెద్దలు చాలా లైట్ గా తీసుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. union budget 2021‌;manmohan;tiru;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;manmohan singh;tirupati;prime minister;chief minister;husband;central government;partyహోదా గీదా జాన్తా నై... అంతేగా....అంతేగా...?హోదా గీదా జాన్తా నై... అంతేగా....అంతేగా...?union budget 2021‌;manmohan;tiru;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;manmohan singh;tirupati;prime minister;chief minister;husband;central government;partyMon, 01 Feb 2021 14:30:04 GMTఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వీధుల్లోకి రారు. తిరుగుబాటు చేయరు. చాలా సైలెంట్ గా ఎవరి వ్యాపకాల్లొ వారు  ఉంటారు. ఎన్నికల్లో కోపం వస్తే చేసేది ఏముంది నోటా కంటే తక్కువ ఓట్లు ఇస్తారు. అంతేగా. మరి ఇలాంటి ధీమాలతోనే ఏపీని కేంద్రంలోని పెద్దలు చాలా లైట్ గా తీసుకుంటున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరింది బీజేపీ, ఆ పార్టీ పెద్దలే రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ని పట్టు బట్టి మరీ భారీ ప్రకటన చేయించారు. ఆ మీదట బీజేపీ 2014 ఎన్నికల ముందు కూడా తిరుపతి నుంచి ప్రత్యేక హోదా హామీని మళ్లీ మళ్ళీ వల్లించింది. ఇప్పటికి ఏడేళ్ళు గడచాయి. ప్రత్యేక  హోదా లేదు, దానికి బదులుగా ఇస్తామన్న ప్రత్యేక  ప్యాకేజి లేదు. ఏపీ పరిస్థితి ఎలా తయారయింది అంటే మొదటికే మోసం అన్న మాట.

దానికి బదులుగా ఇది ఇస్తామంటూ ఆఖరుకు  ఏదీ కాకుండా చేశారు. అయినా అడిగే సీన్ ఏదీ ఏపీ రాజకీయ పార్టీలలో కనిపించడంలేదు. దీంతోనే లైట్ గా తీసుకుంటూ ఎప్పటికపుడు బడ్జెట్ లో దారుణంగా మొండి చేయి చూపిస్తున్నారు. అయినా సరే ఆశగా ప్రతీ సారి బడ్జెట్ వైపు చూడడం ఆనక తాపీగా నిరాశ పడడం ఏపీ జనాల వంతు అవుతోంది.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళి మరీ వినతిపత్రం ఇచ్చి వచ్చారు. ఇలా ఎన్ని సార్లు ఇచ్చినా కూడా ఆ కాగితాలు ఢిల్లీ ప్రయాణం చార్జీల ఖర్చు తప్ప ఏపీకి ఒరిగేది ఏదీ లేదని తేలిపోతోంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిఖార్సుగా ఒరిగింది ఇదీ అని చెప్పలేని స్థితి ఉంది. ఇంత పెద్ద బడ్జెట్ లో అయిదు కోట్ల మందికి పైగా ఉన్న ఒక రాష్ట్రానికి ఏ ప్రాజెక్టూ ప్రకటించకపోవడం కేంద్రం తప్పు అనాలా, గట్టిగా నిలదేయలేని ఏపీ పార్టీలూ, పాలకుల తప్పు అనాలా అన్నదే అర్ధం కాని విషయమని మేధావులు అంటున్నారు. మొత్తానికి ఏపీకి మరోసారి మొండి చేయి మిగిలింది. అది మళ్ళీ రుజువు అయింది.




బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>