PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates963089b7-cf28-4a4d-ad54-4c8fe35e3e61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates963089b7-cf28-4a4d-ad54-4c8fe35e3e61-415x250-IndiaHerald.jpgకాసు బంగారం రేటు ఏకంగా రు. 50 వేలు ట‌చ్ అయ్యి అస‌లు సామాన్యుడికి బంగారం అంద‌దా ? అన్న సందేహాలు క‌లిగించింది. అయితే తాజా నిర్ణ‌యంతో బంగారం రేట్లు మరింత డౌన్ అవ్వ‌డంతో పాటు 10 గ్రాముల బంగారం రు. 35 వేల‌కు కాస్త అటూ ఇటూగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ విడిభాగాలు, మొబైల్ ఫోన్స్ తదితరాల ధరలు మాత్రం పెరగనున్నాయి. ఇక ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక వివిధ రాష్ట్రాల‌కు ప‌నుల కోసం వెళ్లే union budget 2021;amala akkineni;om birla;nirmala sitharaman;silver;letter;central government;aprilబడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...union budget 2021;amala akkineni;om birla;nirmala sitharaman;silver;letter;central government;aprilMon, 01 Feb 2021 14:06:22 GMTఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గంట 51 నిమిషాలు సాగిన నిర్మల ప్రసంగం ముగిసింది. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ  ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. తాజా బ‌డ్జెట ప్ర‌సంగం అనంత‌రం లోక్ స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా రేప‌టికి వాయిదా వేశారు. ఇక బ‌డ్జెట్ సంస్క‌ర‌ణ‌ల త‌ర్వాత కొన్ని వ‌స్తువుల రేట్లు పెరిగితే.. మ‌రి కొన్ని వ‌స్తువ‌ల రేట్లు త‌గ్గ‌నున్నాయి.

ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రి క‌ల అయిన బంగారం ధరలునున్నాయి. వెండి ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్ 2021లో ప్రవేశపెట్టిన సంస్కరణల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి బంగారం రేట్లు పెరిగే విష‌యంలో బ్రేకులు లేవు. కాసు బంగారం రేటు ఏకంగా రు. 50 వేలు ట‌చ్ అయ్యి అస‌లు సామాన్యుడికి బంగారం అంద‌దా ? అన్న సందేహాలు క‌లిగించింది. అయితే తాజా నిర్ణ‌యంతో బంగారం రేట్లు మరింత డౌన్ అవ్వ‌డంతో పాటు 10 గ్రాముల బంగారం రు. 35 వేల‌కు కాస్త అటూ ఇటూగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అయితే ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ విడిభాగాలు, మొబైల్ ఫోన్స్ తదితరాల ధరలు మాత్రం పెరగనున్నాయి. ఇక ఒకే దేశం... ఒకే రేషన్ కార్డు విధానాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక వివిధ రాష్ట్రాల‌కు ప‌నుల కోసం వెళ్లే వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నా... వాటా ప్రకారం రేషన్ తీసుకోవచ్చని నిర్మలా పేర్కొన్నారు.

ఇక మొబైల్‌ ధరలు పెర‌గ‌నున్నాయి. అక్టోబర్‌ 21 నుంచి కొత్త కస్టమ్స్‌ పాలసీ అమ‌లులోకి రానుంది. ట్యాక్స్‌ ఆడిటింగ్‌ నుంచి ఎన్నారైలకు మినహాయింపు ఇవ్వ‌గా... ట్యాక్స్‌ ఆడిట్‌ పరిమితి రూ.10 కోట్లకు పెంచ‌నున్నారు.




ఇంతకీ ఏపీ ఎక్కడుంది సార్...?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>