PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teachersfe19e6db-a89c-41fb-a92c-954be3ef0631-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/private-teachersfe19e6db-a89c-41fb-a92c-954be3ef0631-415x250-IndiaHerald.jpgకరోనా వేళ అందరికంటే ఎక్కువగా ఇబ్బందిపడుతున్నది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులేనంటే అతిశయోక్తి లేదు.. నీటుగా తయారై బడిలో పాఠాలు చెప్పే వారు కరోనా పుణ్యమా అని పొట్టకూటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు గడవటం కోసం కొందరు కూలీ పనులకు సైతం వెళ్తున్నారు. కొందరు కూరగాయలు అమ్ముతున్నారు. ఇంకొందరు చిన్నాచితకా పనులు చూసుకుంటున్నారు. కరోనా మ‌హ‌మ్మారి పంజా ప్రైవేటు టీచ‌ర్లపై ప‌డింది. మొదట్లో రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగ‌డంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాలలు తెరుచుకోలేదు. దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుprivate-teachers;teachers;panjaaటీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!private-teachers;teachers;panjaaMon, 01 Feb 2021 09:00:00 GMTపంజా ప్రైవేటు టీచ‌ర్లపై ప‌డింది.

మొదట్లో రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగ‌డంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాలలు తెరుచుకోలేదు. దీంతో ప్రైవేటు ఉపాధ్యాయుల‌కు ఉపాధిలేకుండా పోయింది. వారి కుటుంబాలు జీవ‌నోపాధి కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠ‌శాలల్లో లక్షల సంఖ్యలో ఉపాధ్యాయులుగా ప‌ని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌ని చేస్తున్న ఉపాధ్యాయుల‌కు కాస్త అటో ఇటో అయినా జీతాలు వచ్చాయి. కానీ.. క‌రోనా కార‌ణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల‌కు మాత్రం ఎలాంటి జీతాలు రావ‌డం లేదు.

నెలల తరబడి జీతాలు లేక వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా న‌ష్టపోయారు. కుటుంబ పోష‌ణ కోసం ఏం చేయ‌డానికైనా సిద్దమ‌వుతున్నారు. కానీ వీరికి స‌రిప‌డా ప‌నుల్లేక ప‌స్తులుంటున్నారు. వీరి కష్టాలను గుర్తించే నాథుడే క‌రువ‌య్యాడు. కుటుంబ పోషణ కూడా భారమై తీవ్ర ఆవేదన అనుభవిస్తున్నారు. ఇంటి అద్దె, క‌రెంటు బిల్లు, కుటుంబ పోష‌ణ చాలా క‌ష్టం అవుతుంద‌ని ప్రైవేటు టీచ‌ర్లు చెబుతున్నారు. కరోనా విప‌త్తు కింద‌ ప్రభుత్వం స్పందించి ప్రైవేటు టీచ‌ర్లకు క‌నీస వేత‌నం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇప్పుడిప్పుడే పాఠశాలలు ప్రారంభం అవుతున్నా.. వీరికి జీతాలు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి. ఆన్ లైన్ క్లాసుల కారణంగా చాలా తక్కువ మందితో పాఠశాలలు నడుస్తున్నాయి. కనీసం ప్రభుత్వాలైనా వీరి గోడు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి ప్రభుత్వాలు ఆ విషయాన్ని గుర్తించాలని కోరుకుందాం.. సమాజాన్ని నిర్మించే ఉపాధ్యాయుడు ఆకలితో అలమటించడం రాజ్యానికి శ్రేయస్కరం కాదు.  




ఆ క‌మ్మ నేత వైసీపీకి షాక్ ఇస్తారా... బీజేపీలోకేనా ?

కేంద్ర బడ్జెట్: కొవిడ్ పన్ను మోత మోగిపోద్ది.. కానీ..!

బడ్జెట్‌: ఓవైపు చైనాతో యుద్ధం.. నిర్మలమ్మ ఏం చేస్తారో..?

బడ్జెట్‌: మీరు తప్పక తెలుసుకోవాల్సిన బడ్జెట్‌ విశేషాలు ఇవే..!

బడ్జెట్‌: దేశ ప్రజలకు కరోనా వాత తప్పదా..?

జగడ్డ: ఏపీలో తొలిదశ 93 పంచాయతీలు ఏకగ్రీవం..

హెరాల్డ్ సెటైర్ : ఇంట్లో కూర్చుని ఇంత పని చేస్తున్నాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>