Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/union-budget-2021c7fcde54-ba1d-4232-bd09-0613f18fbb63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/union-budget-2021c7fcde54-ba1d-4232-bd09-0613f18fbb63-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలకు ఈ సారి బడ్జెట్‌లో కూడా అన్యామనే జరిగింది. విజయవాడకు సరుకు రవాణా కారిడార్ మినహా మరే ఇతర కేటాయింపులూ తెలుగు రాష్ట్రాలకు జరగలేదు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలను విస్మరించడం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ అవలంబించే విధానమే. కానీ ఈ సారి బీజేపీ ప్రభుత్వం కనీస కేటాయింపులు..union budget 2021;prema;kerala;delhi;visakhapatnam;bharatiya janata party;vijayawada;karnataka - bengaluru;west bengal - kolkata;vishakapatnam;karnataka 1;love;chennai;central government;partyకేంద్ర బడ్జెట్ 2021: తెలుగు రాష్ట్రాలకు అంతా సున్నా..!కేంద్ర బడ్జెట్ 2021: తెలుగు రాష్ట్రాలకు అంతా సున్నా..!union budget 2021;prema;kerala;delhi;visakhapatnam;bharatiya janata party;vijayawada;karnataka - bengaluru;west bengal - kolkata;vishakapatnam;karnataka 1;love;chennai;central government;partyMon, 01 Feb 2021 04:06:00 GMTన్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు ఈ సారి బడ్జెట్‌లో కూడా అన్యామనే జరిగింది. విజయవాడకు సరుకు రవాణా కారిడార్ మినహా మరే ఇతర కేటాయింపులూ తెలుగు రాష్ట్రాలకు జరగలేదు. కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలను విస్మరించడం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీ అవలంబించే విధానమే. కానీ ఈ సారి బీజేపీ ప్రభుత్వం కనీస కేటాయింపులు కూడా చేయకుండా మరింత దారుణంగా ప్రవర్తించింది. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేల కోట్లు కేటయింపులు చేసిన కేంద్రం.. రెండు తెలుగు రాష్ట్రాలకు కనీసం వందల్లో కూడా ఇవ్వలేదు.


చెన్నై మెట్రో రైలు విస్తరణకు రూ.63, 246 కోట్లు కేటాయించగా.. బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. ఆ రాష్ట్రాల్లో  కానీ హైదరాబాద్‌లో అభివృద్ధి అవుతున్న మెట్రో కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక నాసిక్‌లో కొత్త మెట్రో కారిడార్ ఏర్పాటుకూ కేటాయింపులు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్, విజయవాడలకు మాత్రం కనీసం ఖాళీ చేయి కూడా విదిలించలేదు. ఇంకా విచిత్రం ఏంటేంటే కనీసం బడ్జెట్ ప్రసంగం మొత్తంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. తెలుగు రాష్ట్రాల పేర్లు కూడా పలకలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు తమిళనాడు సహా దక్షిణాదిలోని కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వివిధ అభివృద్ధి పనుల కింద బాగానే కేటాయించారు. జాతీయ రహదారులు ప్రాజెక్టులు భారీ స్థాయిలోనే ప్రకటించారు. ఇక ఉత్తరాదిన బెంగాల్, ఈశాన్యాన అస్సాం, ఇలా నిర్దిష్ట రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయింపులు చేసుకుంటూ, ఆయా రాష్ట్రాల్లో జాతీయ రహదారులు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌ల కోసం వేల కోట్లు కేటాయించారు. ఒక్క ఖరగ్‌పూర్-విజయవాడ కారిడార్ మినహా మరే ఇతర కేటాయింపుల్లో కూడా తెలుగు రాష్ట్రాల ఊసే రాలేదు.

ఇదిలా ఉంటే ఈ కేటాయింపులు జరిగిన విధానాన్ని విశ్లేషించిన కొందరు నిపుణులు ఇవన్నీ ఎన్నికల ముందు పంచుతున్న తాయిలాలని తేల్చేశారు. ఆయా రాష్ట్రాల్లో అతి త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే కేద్రం అతి ప్రేమ చూపెడుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఎప్పటిలానే తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఈ బడ్జెట్‌లో కూడా పూర్తి స్థాయిలో అన్యాయమే జరిగింది. కనీసం మొండి చేయి కూడా మిగలలేదు.


ప్రిన్స్ మహేశ్ తో సినిమా చేస్తానంటున్న లేడీ డైరెక్టర్?

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!

జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>