MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-how-comedian-sunils-wife-isca684b13-5be1-4caa-8e63-61e03557d855-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/do-you-know-how-comedian-sunils-wife-isca684b13-5be1-4caa-8e63-61e03557d855-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ సునీల్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సునీల్. ఇక సునీల్ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ హీరో రేంజ్ ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో విలన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు. sunil;shruti;harish shankar;prema;shankar;sruthi;sunil;trivikram srinivas;marriage;love;wife;comedian;hero;bhimavaram;idea;nuvve kavali;manasantha nuvveకమెడియన్ సునీల్ భార్య ఎలా ఉంటుందో తెలుసా..!?కమెడియన్ సునీల్ భార్య ఎలా ఉంటుందో తెలుసా..!?sunil;shruti;harish shankar;prema;shankar;sruthi;sunil;trivikram srinivas;marriage;love;wife;comedian;hero;bhimavaram;idea;nuvve kavali;manasantha nuvveMon, 01 Feb 2021 11:00:00 GMTకమెడియన్ సునీల్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన శైలిలో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సునీల్. ఇక సునీల్ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ హీరో రేంజ్ ఎదిగాడు. ఇక ఇండస్ట్రీలో విలన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు. నువ్వే కావాలి సినిమాతో పరిచయం అయిన సునీల్.. నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు. నందితో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

అయితే సినిమాల పరంగా సునీల్ లైఫ్ తెరిచిన పుస్తకమే కానీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఈయన గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా సునీల్ కుటుంబం ఎలా ఉంటుంది.. ఆయన భార్య గురించి వివరాలేంటి అనేది చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు భీమవరంలోనే ఉండేవాడు సునీల్. స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చాడు. స్టార్ అయిపోయాడు.. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నాడు సునీల్.



ఇక ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన భార్య గురించి కానీ.. కుటుంబం గురించి కానీ చాలా మందికి ఐడియా లేదు. కేవలం 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్. అప్పట్నుంచి అమ్మ లాలనలోనే పెరిగాడు సునీల్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల‌కు అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం.

అయితే సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి. ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు. పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్. తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్. ఈయనది ప్రేమ వివాహం కాదు.. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే. 45 ఏళ్ల సునీల్‌కు ఒక పాప‌, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌దు. కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం కమెడియన్‌గా నటిస్తూనే.. హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్యాలో హీరోగా నటిస్తున్నాడు.




బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>