PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202146ddaecd-8835-4e6a-a0f8-53a027fe75a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/union-budget-202146ddaecd-8835-4e6a-a0f8-53a027fe75a5-415x250-IndiaHerald.jpgఅందరూ ఊహించినట్లే... దాదాపు గత పది నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల, వర్గాల ప్రజలను అనేక రకాల అవస్థలకు గురి చేసిన భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు ఈ బడ్జెట్ కేటాయింపులలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాల్సి ఉన్న విషయం తెలిసిందే. కావున నేటి కీలక బడ్జెట్‌-2021 సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.union budget 2021;bharatiya janata party;nirmala sitharaman;minister;central government;coronavirusబడ్జెట్ 2021: దేశ ప్రజల కరోనా వ్యాక్సినేషన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయింపుబడ్జెట్ 2021: దేశ ప్రజల కరోనా వ్యాక్సినేషన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయింపుunion budget 2021;bharatiya janata party;nirmala sitharaman;minister;central government;coronavirusMon, 01 Feb 2021 17:10:00 GMTఅందరూ ఊహించినట్లే... దాదాపు గత పది నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల, వర్గాల ప్రజలను అనేక రకాల అవస్థలకు గురి చేసిన భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు ఈ బడ్జెట్ కేటాయింపులలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాల్సి ఉన్న విషయం తెలిసిందే. కావున నేటి కీలక బడ్జెట్‌-2021 సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.




అదేవిధంగా ఒకవేళ కొవిడ్ వ్యాక్సిన్ డోసుల ధర పెరిగితే అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను కూడా పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. కొవిడ్ మహమ్మారితో కుదేలైన వేళ కేంద్ర బడ్జెట్-2021లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ‘కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగానే కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం రూ.35,000 కోట్లు కేటాయిస్తున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 68.6 కోట్ల మంది జనాభాకు డోసుకు రూ. 255 చొప్పున రెండు డోసుల టీకాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకవేళ ఈ డోసుల ధర పెరిగితే దానికి అనుగుణంగా బడ్జెట్‌ను మరింత పెంచుతాం’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇక అతి త్వరలోనే మరో రెండు కొవిడ్ వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చెప్పారు. ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని.. భారతీయులకే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆ టీకాలను సరఫరా చేస్తున్నామని ఆమె తెలిపారు. ‘కరోనా వైరస్ మహమ్మారిని దేశం సమర్థంగా ఎదుర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్ మరణాల రేటు, యాక్టివ్ కేసుల రేటు అత్యంత తక్కువగా ఉంది. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 లక్షల మంది జనాభాకు 130 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రభుత్వ చర్యల వల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది’ అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు.




బాయ్ ఫ్రెండ్ కోసం వెళ్లి దొరికిపోయిన మహేష్ హీరోయిన్....

జగడ్డ : జగనోరికి సొంత పార్టీ నుంచే భారీ షాక్...?

నదియా గురించి బయటపడ్డ సంచలన నిజాలు..!

బడ్జెట్ ఎఫెక్ట్ : మోతెక్కనున్న వాటి ధరలు..పడిపోనున్న వీటి ధరలు !!

జగడ్డ : బాబు మాట ఖాతరు చేయని అచ్చెన్న...?

జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>