PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgరాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైసీపీ వాళ్లే రెండు గ్రూపులుగా విడిపోయి నామినేష‌న్లు వేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం చాలా చోట్ల త‌మ పార్టీ నేత‌ల‌కు అనుకూలంగా ఏక‌గ్రీవాలు జ‌ర‌గాల‌ని అనుకుంటే ఇక్క‌డ మాత్రం మ‌రో ర‌కంగా జ‌రుగుతోంది. త‌మ‌కు టీడీపీ పోటీ కాకుండా.. త‌మ‌లో తామే క‌ల‌హించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. పార్టీ రూలింగ్‌లో ఉంది.. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు ప‌ద‌వులు అనుభ‌విస్తామ‌ని వారు వెన‌క్కు త‌గ్గ‌కుండా పోటీలో ఉండేందుకే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన గ‌న్న‌వ‌రం, jagan ysrcp;andhra pradesh;letter;tdp;chirala;ycp;cyclone bulbul;petta;partyఏపీలో వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ... జ‌గ‌నోరు అనుకుందొక‌టి.. అయ్యిందొక‌టి ?ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ వైసీపీ... జ‌గ‌నోరు అనుకుందొక‌టి.. అయ్యిందొక‌టి ?jagan ysrcp;andhra pradesh;letter;tdp;chirala;ycp;cyclone bulbul;petta;partyMon, 01 Feb 2021 10:52:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి.. అయ్యింది ఒక‌టి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్న చందంగా వైసీపీ ప‌రిస్థితి మారింది. అస‌లే వైసీపీలో కేడ‌ర్ తో పోటీగా లీడ‌ర్లు త‌యార‌య్యారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నేత‌ల‌తో అస‌లు ఆ పార్టీ వీరాభిమానులు.. పార్టీ కోసం ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. 2019లో పార్టీ అధికారంలోకి వ‌చ్చాక అంత‌కు ముందు జ‌గ‌న్‌ను తిట్టిన వాళ్లు కూడా వైసీపీ కండువా క‌ప్పేసుకున్నారు.

ఇప్పుడు ఈ జంపింగ్ నేత‌ల‌తోనే వైసీపీ వాళ్ల‌కు నానా క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆటు పాత వ‌ర్సెస్ కొత్త నేత‌ల మ‌ధ్య చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పంచాయితీలు న‌డుస్తున్నాయి. దీంతో పార్టీ నేతలకు కిందిస్థాయి క్యాడర్ ను బుజ్జగించడం కత్తిమీద సాముగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వైసీపీ వాళ్లే రెండు గ్రూపులుగా విడిపోయి నామినేష‌న్లు వేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం చాలా చోట్ల త‌మ పార్టీ నేత‌ల‌కు అనుకూలంగా ఏక‌గ్రీవాలు జ‌ర‌గాల‌ని అనుకుంటే ఇక్క‌డ మాత్రం మ‌రో ర‌కంగా జ‌రుగుతోంది.

త‌మ‌కు టీడీపీ పోటీ కాకుండా.. త‌మ‌లో తామే క‌ల‌హించుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. పార్టీ రూలింగ్‌లో ఉంది.. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు ప‌ద‌వులు అనుభ‌విస్తామ‌ని వారు వెన‌క్కు త‌గ్గ‌కుండా పోటీలో ఉండేందుకే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు వ‌చ్చిన గ‌న్న‌వ‌రం, చీరాల నియోజ‌క‌వర్గాల్లో నామినేషన్లు వేయడానికి రెండు వర్గాలు పోటీ పడ్డాయి. ఇది అధికార వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.

చీరాల నియోజకవర్గంలో రామన్న పేట పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ స్థానంతో పాటు 14 వార్డులకు ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని స్థానాల్లోనూ రెండు వర్గాలు పోటీ పడి మరీ నామినేషన్లు వేశాయి. పార్టీ మారిన క‌ర‌ణం త‌న వ‌ర్గానికే ప‌ద‌వులు కావాల‌ని ప‌ట్టు బ‌డుతుండ‌డంతో నిజమైన వైసీపీ వాళ్ల‌కు న్యాయం జ‌ర‌గ‌ని ప‌రిస్థితి.  


వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !

జగడ్డ: మహిళా ఎమ్మార్వోకి షాకిచ్చిన నిమ్మగడ్డ

వైసీపీలో పంచాయితీలే.. ఈ నేత‌ల‌తో జ‌గ‌న్ నిండా మునిగిన‌ట్టే ?

యూనియన్ బడ్జెట్ 2021: నిర్మలాజి ఏ విధంగా ‘చూమంతర్ బడ్జెట్’ చేస్తుందో మరి!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>