PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/spirituality/pisces_pisces/who-are-blue-gods4230caf1-6f6b-487e-9451-2f10af83e678-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/spirituality/pisces_pisces/who-are-blue-gods4230caf1-6f6b-487e-9451-2f10af83e678-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో దాడుల విషయం సంచలనం అయింది. ఈ దేవాలయాలలో దాడులపై అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. విపక్షాల మీద ఈ నెపం నెట్టే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా ఈ దాడుల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ దాడుల అంశం సంచలనంగా మారింది. దీనిని ఏకంగా హిందుతంపై దాడిగా బిజెపి చెప్తుంది. టీడీపీ కూడా ఇప్పుడు జై శ్రీరాం అనడం మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే... రాజమండ్రి లgod;ashok kumar;kumaar;ashok;deva;murali krishna;bharatiya janata party;andhra pradesh;police;january;media;tdp;hindus;rajahmundry;partyషాకింగ్: పూజారే దేవుడ్ని కూల్చాడా...?షాకింగ్: పూజారే దేవుడ్ని కూల్చాడా...?god;ashok kumar;kumaar;ashok;deva;murali krishna;bharatiya janata party;andhra pradesh;police;january;media;tdp;hindus;rajahmundry;partyMon, 01 Feb 2021 11:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల్లో దాడుల విషయం సంచలనం అయింది. ఈ దేవాలయాలలో దాడులపై అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. విపక్షాల మీద ఈ నెపం నెట్టే ప్రయత్నం అధికార పార్టీ నేతలు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా ఈ దాడుల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ దాడుల అంశం సంచలనంగా మారింది. దీనిని ఏకంగా హిందుతంపై దాడిగా బిజెపి చెప్తుంది.

టీడీపీ కూడా ఇప్పుడు జై శ్రీరాం అనడం మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే... రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఒక దాడి సంచలనం అయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రాజమండ్రి లో మీడియా సమావేశంలో సిట్ డిఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజమండ్రి- లలితానగర్ లో వినాయక ఆలయం లోపల సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు అరెస్టు అయ్యారని ఆయన వివరించారు. ఆలయ పురోహితుడు మర్ల వెంకట మురళీకృష్ణతో పాటుగా మళ్ళ వెంకటరాజు,  దంతులూరి వెంకటపతిరాజు అరెస్టు అయ్యారని ఆయన పేర్కొన్నారు.

జనవరి 1 ఘటన జరిగిందని ఆయన వివరించారు. సోషల్ మీడియా లో ప్రచారం చేయాలనే లక్ష్యంగా సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహాన్ని ధ్వంసానికి పాల్పడ్డారు  అని పేర్కొన్నారు. 30 వేల రూపాయలు పూజారి మురళీకృష్ణ కు వెంకటరాజు, వెంకటపతిరాజు ఇచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించారు అని ఆయన  వివరించారు. కేసు ఇంకా దర్యాప్తు జరుగుతుంది అని అన్నారు. మరికొందరు కూడా వున్నట్టు అనుమానాలు వున్నాయి అన్నారు. ఆలయం లోపల సుబ్రమణ్యేశ్వరస్వామి విగ్రహం  పెట్టిన తర్వాత ఆలయంలో బాగోలేదని పూజారి ఈ చర్యకు పాల్పడ్డారని కూడా విచారణలో తేలింది అని ఆయన వివరించారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పారు.


బుట్టబొమ్మ కాస్త బాపు బొమ్మలా మారిందేంటి ?

దర్శకులతో గొడవపడుతున్న హేమ !

జగడ్డ : కర్నూలులో రంగంలోకి దిగిన ఎమ్మెల్యే.. ఇక అక్కడ సీన్ రిపీటవుతుందా..?

వై.ఎస్. షర్మిలకు సవాల్ విసిరిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ..?

జగడ్డ : టీడీపీలో నంబర్ టూ టార్గెట్ గా వైసిపీ...?

టీచర్ల వెతలు: అయ్యో.. కూలీ పనులు చేసుకుంటున్న పంతుళ్లు..!

ఆర్ ఆర్ ఆర్ ను వదిలిపెట్టని అలనాటి రాజమౌళి శ్రీదేవిల రగడ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>