PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-what-it-means-for-a-palm-fruit-to-fall-on58ac9c52-0c06-46ee-9c28-9708fb9ad465-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-what-it-means-for-a-palm-fruit-to-fall-on58ac9c52-0c06-46ee-9c28-9708fb9ad465-415x250-IndiaHerald.jpgపెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే...పెట్రోలు, డీజిల్ ధరలు...వంద దాటనున్నాయి. పది పైసలు, 20 పైసలు పెంచుకుంటూ పోతుండటంతో... వాహనదారులపై ధరాభారం పడుతోంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర 89.62 కాగా, డీజిల్‌ రూ.82.66గా ఉంది. పదిరోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌పై దాదాపు 3 రూపాయలు, డీజిల్‌పై రూ.3.64 పెరిగిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. this is what it means for a palm fruit to fall on;ashok;ashok gehlot;congress;bus;chief minister;petrol;diesel;gaganamమూలిగే నక్కమీద తాటిపండు పడటం అంటే ఇదే..!మూలిగే నక్కమీద తాటిపండు పడటం అంటే ఇదే..!this is what it means for a palm fruit to fall on;ashok;ashok gehlot;congress;bus;chief minister;petrol;diesel;gaganamSun, 31 Jan 2021 13:00:00 GMTడీజిల్ ధరలు...వంద దాటనున్నాయి. పది పైసలు, 20 పైసలు పెంచుకుంటూ పోతుండటంతో... వాహనదారులపై ధరాభారం పడుతోంది. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర 89.62 కాగా, డీజిల్‌ రూ.82.66గా ఉంది. పదిరోజుల వ్యవధిలో లీటర్‌ పెట్రోల్‌పై దాదాపు 3 రూపాయలు, డీజిల్‌పై రూ.3.64 పెరిగిందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే రాజస్థాన్‌లో శ్రీగంగాపూర్‌లో...లీటర్‌ ప్రీమియం పెట్రోల్ ధర...వంద రూపాయలు దాటింది. డీజిల్ 90రూపాయలకు చేరింది. సాధారణ పెట్రోలు...రూ.96లు ఉంది. ధరలపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 38 శాతం మేర ఉన్న వ్యాట్.. 36 శాతానికి తగ్గించారు. డీజిల్‌పై 28 శాతం ఉన్న వ్యాట్ 26 శాతానికి తగ్గింది. దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జైపూర్‌లో లీటర్ పెట్రోల్ 92.51, డీజిల్ 84.62 రూపాయలకు చేరింది.

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు జీవనమే గగనంగా మారింది. ఎనిమిది నెలలుగా వ్యాపారాలు సన్నగిల్లాయి. ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. వందలాది మంది ప్రయివేటు ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పెట్రోబాంబులు పేలుతుండడంతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. కరోనా ప్రభావంతో బస్సులు కూడా పూర్తిస్థాయిలో తిరగడం లేదు. మరోవైపు ప్రైవేటు వాహనాల్లో అధిక మంది ప్రయాణికులతో ప్రయాణిస్తే.. కరోనా భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. పెట్రో భారాన్ని భరిస్తున్నారు.  పెరుగుతున్న పన్నులే పెట్రో ధరల పెంపునకు ప్రధాన కారణమని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఈ మేరకు రాజస్థాన్‌లో ముఖ్యమబత్రి అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఫలితంగా 38 శాతం మేర ఉన్న వ్యాట్.. 36 శాతానికి చేరింది. డీజిల్‌పై 28 శాతం మేరకు ఉన్న వ్యాట్ 26 శాతానికి తగ్గింది. ఈ ఉత్తర్వులు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ఒక్కింటికి 92.51, డీజిల్ 84.62 రూపాయలకు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ ఇంకా కొనసాగుతోంది.




ధోనీ అరుదైన రికార్డు పై కన్నేసిన కోహ్లీ.. కేవలం అడుగు దూరంలో..?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?

ప‌శ్చిమ పంచాయ‌తీల్లో ఫ్యాన్‌కు బ్యాండ్ ప‌డిపోద్దిగా... ఈ నాలుగు చోట్ల క‌ష్ట‌మే ?

కృష్ణా `పంచాయ‌తీ` ఎవ‌రి సొత్తు.. ఆ పార్టీకి దెబ్బ‌డిపోయిన‌ట్టే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>