PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp1d4a4f23-de00-45a8-a098-d2d9ee5645a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp1d4a4f23-de00-45a8-a098-d2d9ee5645a0-415x250-IndiaHerald.jpg అంటే.. దీనిని బ‌ట్టి పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుం టున్నారో.. అర్ధ‌మ‌వుతోంది. ఇక‌, ఈ ప్ర‌య‌త్నాల‌పై సొంత పార్టీలోనే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌మిటీల ఏర్పాటు స‌రే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ప‌ట్టించుకునే వారు లేర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ``మా నాయ‌కుడు క‌మిటీలు ఏర్పాటు చేశారు. కానీ, క‌త్తిప‌ట్టుకుని రంగంలోకి దిగేవారు ఉంటే క‌దా?!` అని విజ‌యవాడ‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా టీడీపీ నేత‌ల్లో ఆత్మ స్థ‌యిర్యం పెంచేలా chandra babu;view;nithya new;2019;letter;tdpబాబోరు ప్లానింగ్ మామూలుగా లేదే... క‌ష్టాలు తీరేనా ?బాబోరు ప్లానింగ్ మామూలుగా లేదే... క‌ష్టాలు తీరేనా ?chandra babu;view;nithya new;2019;letter;tdpSun, 31 Jan 2021 08:00:00 GMTపంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తున్నారు. గత 2019 లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏవిధంగా అయితే.. ఆయ‌న స్పందించారో.. ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగారో.. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ అదే రీతిలో స్పందిస్తున్నారు. నిత్యం నేత‌ల‌తో ట‌చ్‌లోకి వ‌స్తున్నారు. నాయ‌కుల‌తో జిల్లాల వారీగా.. స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, తాజాగా సమ‌న్వ‌య క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇక‌, ఈ క‌మిటీల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు అంత‌ర్గత క‌మిటీల‌ను నియ‌మించారు.

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే అభ్య‌ర్థుల‌కు సాయం చేసేందుకు, న్యాయ స‌ల‌హాలు ఇచ్చేందుకు మ‌రో ప‌ది క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు చంద్ర‌బాబు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఏదైనా స‌మాచారం కావాలంటే ఇచ్చేందుకు కూడా క‌మిటీల‌ను ఏర్పాటు చేసి.. ప‌దుల సంఖ్యలో నాయ‌కుల‌కు బాధ్య‌త అప్ప‌గించారు. అంటే.. దీనిని బ‌ట్టి పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుం టున్నారో.. అర్ధ‌మ‌వుతోంది. ఇక‌, ఈ ప్ర‌య‌త్నాల‌పై సొంత పార్టీలోనే మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. క‌మిటీల ఏర్పాటు స‌రే.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ప‌ట్టించుకునే వారు లేర‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

``మా నాయ‌కుడు క‌మిటీలు ఏర్పాటు చేశారు. కానీ, క‌త్తిప‌ట్టుకుని రంగంలోకి దిగేవారు ఉంటే క‌దా?!` అని విజ‌యవాడ‌కు చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా టీడీపీ నేత‌ల్లో ఆత్మ స్థ‌యిర్యం పెంచేలా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అదే స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డం లేదని.. ఫ‌లితంగా.. అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన లోకేష్‌.. ఇప్పుడు కీల‌క ‌స‌మ‌యంలో లేక‌పోవ‌డంపైనా నాయ‌కులు పెద‌వి విరుస్తున్నార‌ని అన్నారు. మొత్తానికి.. చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు బాగున్నా.. ఫ‌లితం వ‌చ్చే అవ‌కాశాలు మాత్రం త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతున్నారు. మ‌రి బాబు ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. 


ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>