PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajamundry-temple-cased5b4105d-3389-4616-961d-03ad9f21c379-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajamundry-temple-cased5b4105d-3389-4616-961d-03ad9f21c379-415x250-IndiaHerald.jpgపోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు.. అతడికి డబ్బు ఇచ్చి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ద్వంసం చేయాల్సిందిగా సూచించారు. ఆర్థిక పరిస్థితులు రీత్యా దానికి వెంకట మురళీ కృష్ణ ఒప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 31న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులను ధ్వంసంచేసి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడుrajamundry temple case;krishna;andhra pradesh;police;january;december;husband;police station;arrest;tdp;traffic police;rajahmundryటీడీపీ నేతలే డబ్బిచ్చి..! విగ్రహం ధ్వంసం కేసులో షాకింగ్టీడీపీ నేతలే డబ్బిచ్చి..! విగ్రహం ధ్వంసం కేసులో షాకింగ్rajamundry temple case;krishna;andhra pradesh;police;january;december;husband;police station;arrest;tdp;traffic police;rajahmundrySun, 31 Jan 2021 20:06:47 GMTఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై వరుసగా జరిగిన దాడులు తీవ్ర కలకలం రేపాయి. రాజకీయ మంటలకు కారణమయ్యాయి. అయితే రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహద్వంసం కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. విగ్రహం ధ్వంసం కేసులో అసలు నిందితుడెవరో పోలీసులు తేల్చేశారు. స్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎవరో నాశనం చేశారంటూ ఫిర్యాదు చేసిన ఆలయ పూజారే అసలు దోషి అని పోలీసులలో విచారణలో నిర్దారణ అయింది.

       గత డిసెంబర్ 31 సంకటహరవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి  విగ్రహం రెండు చేతులు ధ్వంసమయ్యాయి. ఈ విషయమై ఆలయ పూజారి మరల వెంకట మురళీ కృష్ణ, రాజమండ్రి సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి ఒకటిన ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన పోలీసులు.. ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణే విగ్రహం ధ్వంసం చేశారని  వెల్లడించారు.

          పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఆలయ పూజారి వెంకట మురళీ కృష్ణకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ నేతలు.. అతడికి డబ్బు ఇచ్చి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని ద్వంసం చేయాల్సిందిగా సూచించారు. ఆర్థిక పరిస్థితులు రీత్యా దానికి వెంకట మురళీ కృష్ణ ఒప్పుకున్నాడు. గతేడాది డిసెంబర్ 31న సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం చేతులను ధ్వంసంచేసి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

   ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఎనిమిది బృందాలతో పోలీసులు విచారణ చేసి పూజారినే అసలు దోషిగా తేల్చేశారు. పూజారి చెప్పిన విషయాలను  42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ భర్త బట్టి మల్ల వెంకటరాజు , మాజీ టీఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తంతులూరి వెంకటపతి రాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ విషయమై రాజమండ్రి సిటీ పోలీసులు  ప్రకటన కూడా విడుదల చేశారు.




ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్న అకుంఠిత దీక్ష..!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>