PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmgadda-ramesh-kumarcb3f5d9a-0a16-4762-b000-faa653f40e72-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmgadda-ramesh-kumarcb3f5d9a-0a16-4762-b000-faa653f40e72-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నిమ్మగడ్డ ఉండగా అసలు ఎన్నికలు నిర్వహించడం కుదరదని పట్టుబట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల విషయంలో నిమ్మగడ్డను అనేక విధాలుగా టార్గెట్ చేస్తూ వస్తోంది. కానీ నిమ్మగడ్డ మాత్రం ఎక్కడా దొరక్కుండా చాలా పకడ్బందీగా రాజ్యాంగ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నారు. అయితే చంద్రబాబు అంశంలో నిమ్మగడ్డ ఇరుకున పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. బాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అంశాన్ని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం మీద మీరు స్పందించకపోతే చంద్రబాబుకు మీnimmagadda jagan elections;cbn;tiru;february;ycp;v;party;mantraజగడ్డ : సర్కార్ కి ఎక్కడా చిక్కని నిమ్మగడ్డ !జగడ్డ : సర్కార్ కి ఎక్కడా చిక్కని నిమ్మగడ్డ !nimmagadda jagan elections;cbn;tiru;february;ycp;v;party;mantraSun, 31 Jan 2021 08:00:00 GMTవైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. బాబు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అంశాన్ని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం మీద మీరు స్పందించకపోతే చంద్రబాబుకు మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మేము చేస్తున్న ఆరోపణలను నిజమని నమ్మాల్సి వస్తుందని లేఖలో పేర్కొంది. 


అయితే ఈ విషయం మీద నిమ్మగడ్డ టిడిపికి షాక్ ఇచ్చారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి నిమ్మగడ్డ రూల్స్ ప్రకారం వెళుతున్నారు కానీ చంద్రబాబుకి లేదా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పే ప్రూఫ్ ఒక్కటీ లేదు. ప్రభుత్వం అలా భావించి విమర్శలు చేస్తోంది తప్ప ఆయన ఎక్కడా ఒక పార్టీకి గానీ ఒక వ్యక్తికి గానీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పలేము. టీడీపీకి ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవచ్చు అని వైసీపీ భావించి ఉండొచ్చు. కానీ నిమ్మగడ్డ టిడిపికి నోటీసులు ఇచ్చి ఫిబ్రవరి 2వ తారీఖు లోపు ఈ మ్యానిఫెస్టో అంశం మీద వివరణ ఇవ్వకపోతే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 



అంటే మొత్తంగా చూస్తే అధికార వైసీపీ నిమ్మగడ్డను టార్గెట్ చేయడానికి పెద్దగా ఇంకా ఎలాంటి ఆప్షన్స్ మిగిలి ఏమీ లేవు. అందుకే మరీ వింతగా మంత్రులు ఆయన మీద శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నిమ్మగడ్డను టార్గెట్ చేయడానికి కులం అనే పాయింట్, అలానే ఎలాగోలా చంద్రబాబు మనిషి అని ముద్ర వేయాలనే తాపత్రయం తప్ప లీగల్ గా వైసీపీకి ఏమీ దొరకటం లేదనేది విశ్లేషకుల వాదన. చూడాలి ఈ ఎన్నికలు అయ్యేవరకు నిమ్మగడ్డ వర్సెస్ అధికార పార్టీ ట్విస్ట్ లు ఏ మేరకు తిరుగుతాయి అనేది.



ఔను బీజేపీ, టీఆర్ ఎస్ ఒక్క‌ట‌వుతున్నాయి... కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన ఎంపీలు...

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?

అప్పట్లో ఆ ఆఫీసర్‌కి టీడీపీ జై.. ఇప్పుడు టార్గెట్ చేస్తోందా..?

మరో కుర్ర హీరో తో మహేష్ మూవీ ..??

జగడ్డ : బాబోరు అలా చేసారంటే.. జగనోరి గుట్టు రట్టవుతుంది..?

ఫేస్ బుక్ నుంచి తప్పుకున్న సినీ నటి మాధవి లత.. కారణం అదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>