Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgన్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ రోజులు వివిధ పార్టీల నాయకులతో రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 30 మంది మంత్రులు సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకూ జరగాల్సి ఉండగా, సభ్యుల అభ్యర్థన మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్‌లకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించేందుకు వీలుగా ఫిబ్రవరి 13 శనివారం నాడు సమావేశాన్ని కొనసాగించి, ఆరోజు నుంచే నvenkayya naidu;delhi;india;rajya sabha;february;venkaiah naidu;mantraబడ్జెట్ సమావేశల్లో.... వెంకయ్య నాయుడు...?బడ్జెట్ సమావేశల్లో.... వెంకయ్య నాయుడు...?venkayya naidu;delhi;india;rajya sabha;february;venkaiah naidu;mantraSun, 31 Jan 2021 22:24:53 GMTవెంకయ్య నాయుడు...?

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభను అర్ధవంతంగా, సజావుగా పని చేసేలా చూడాలని సభలోని వివిధ పార్టీల నాయకులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. ఆయన సూచనపై స్పందించిన అన్ని పార్టీల నేతలు సభలో జరిగే అన్ని చర్చల్లో సమర్థవంతంగా పాల్గొంటామని, సజావుగా సాగేందుకు సహకరిస్తామని తెలియజేశారు.

న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ రోజులు వివిధ పార్టీల నాయకులతో రాజ్యసభ చైర్మన్ హోదాలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 30 మంది మంత్రులు సహా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 వరకూ జరగాల్సి ఉండగా, సభ్యుల అభ్యర్థన మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్‌లకు సంబంధించిన గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించేందుకు వీలుగా ఫిబ్రవరి 13 శనివారం నాడు సమావేశాన్ని కొనసాగించి, ఆరోజు నుంచే నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు
ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్ మీద చర్చకు మరింత సమయం కావాలని వివిధ పార్టీల నాయకులు కోరగా, ఇందుకోసం తగిన ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన చర్చలు, సభ్యులు ముఖ్యమైన అంశాలపై మరింత చర్చించేందుకు ప్రయోజనకరంగా ఉంటాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మరింత సమయం కేటాయించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.

సభలో సమయ పాలన గురించి ఛైర్మన్ ముప్పవరపు వెంకయ్య మాట్లాడుతూ, మంత్రులు బిల్లులను సభలో ప్రవేశపెట్టడానికి సమాధానం ఇవ్వడానికి క్లుప్తంగా మాట్లాడే నేర్పును అందిపుచ్చుకోవాలని, తద్వారా సభ్యులకు మాట్లాడేందుకు మరింత సమయం లభిస్తుందని సూచించారు.

సభలోని ఇతర చిన్న పార్టీల సభ్యులకు సమయం కేటాయించే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు తగిన సమయం ఇవ్వడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి 20 పార్టీలకు చెందిన సభ్యులు ప్రతి అంశం మీద మాట్లాడ్డం అన్నివేళలా బహుశా సాధ్యం కాకపోవచ్చని, అందుకే తమకు ఆసక్తి కలిగిన అంశాలను ప్రాధాన్య క్రమంలో ఎంచుకోవాలని తెలిపారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.


సునీల్ ఎలాంటి వాడో తెలుసా మీకు...?

‘పుష్ప’లో ఒక్కరు కాదు.. ఇద్దరా..? పోస్టర్ చూసి గుర్తు పట్టేయొచ్చా..?

బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

కొత్త రికార్డు దిశగా మెగా ఫ్యామిలీ...?

జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>