PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpgఉషాశ్రీ చ‌ర‌ణ్ వైఖరితో ప‌లువురు పార్టీ నేత‌లు పార్టీకి దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి. ఆమెను ఎంతో క‌ష్ట‌ప‌డి గెలిపిస్తే స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌కుండా బెంగ‌ళూరుకే ఎక్కువ ప‌రిమితం అవుతున్నారన్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే ఉన్నాయి. పైగా ఆమెకు అనంత‌పురం వైసీపీ ఎంపీ రంగ‌య్య కు మ‌ధ్య కూడా గ్యాప్ తీవ్ర‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉమామ‌హేశ్వ‌ర్ నాయుడు నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నాysrcp;nithya new;thirtha;usha;congress;mp;district;panchayati;mla;usha mulpuri;letter;tdp;local language;ycp;josh;partyలోక‌ల్ ఫైట్‌: వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు అదిరి‌పోయే షాక్‌...!లోక‌ల్ ఫైట్‌: వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు అదిరి‌పోయే షాక్‌...!ysrcp;nithya new;thirtha;usha;congress;mp;district;panchayati;mla;usha mulpuri;letter;tdp;local language;ycp;josh;partySun, 31 Jan 2021 14:50:00 GMTఏపీల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంగ్రామం హోరెత్తుతోంది. ఎన్నిల‌కు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్ రాగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు అధికార పార్టీలోకి ఎక్కువుగా జంప్ చేస్తున్నారు. ఏపీలోని ప‌లు జిల్లాల్లో అధికార పార్టీ నేత‌లు ర‌క‌ర‌కాల ప్ర‌లోభాల‌తో ఇత‌ర పార్టీ వాళ్ల‌కు త‌మ కండువాలు క‌ప్పేస్తున్నారు. అయితే ఇంద‌కు రివ‌ర్స్ సంఘ‌ట‌న అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గంలో జ‌రిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని 60 కుటుంబాలకు చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ  టీడీపీ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో తిమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల్లో 60 కుటుంబాలకు చెందిన మూడు వందల మంది ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ కుమారుడు ఈడిగ వెంకటేశులు ఆధ్వ‌ర్యంలో పార్టీ మారిపోయారు.

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నుంచి పోటీ చేసిన మ‌హిళా ఎమ్మెల్యే ఉషాశ్రీ చ‌ర‌ణ్ వైఖరితో ప‌లువురు పార్టీ నేత‌లు పార్టీకి దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితి. ఆమెను ఎంతో క‌ష్ట‌ప‌డి గెలిపిస్తే స్థానికంగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌కుండా బెంగ‌ళూరుకే ఎక్కువ ప‌రిమితం అవుతున్నారన్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ నేత‌ల్లోనే ఉన్నాయి. పైగా ఆమెకు అనంత‌పురం వైసీపీ ఎంపీ రంగ‌య్య కు మ‌ధ్య కూడా గ్యాప్ తీవ్ర‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఉమామ‌హేశ్వ‌ర్ నాయుడు నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు.

పార్టీ కేడ‌ర్‌కే కాకుండా.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా ముందుంటున్న ప‌రిస్థితి. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ స్వ‌ల్ప కాలంలోనే పుంజుకుంది. తాజాగా కీల‌క‌మైన తిమ్మ‌స‌ముద్ర పంచాయ‌తీ నుంచే 300 మంది కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేర‌డంతో టీడీపీలో ఎక్క‌డాలేని జోష్ నెల‌కొంది. ఈ ప‌రిణామం ఎమ్మెల్యే ఉషా శ్రీచ‌ర‌ణ్‌కు పెద్ద షాకే అని చెప్పాలి. పార్టీ మారిన వారంతా గ‌త 20 ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీలో ఉన్నారు. తాము ఇంత క‌ష్ట‌ప‌డి వైసీపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే త‌మ‌కు క‌నీసం సంక్షేమ ప‌థ‌కాలు కూడా అంద‌లేని.. ఇక ఎమ్మెల్యే ప‌నితీరుతో విసిగిపోయి పార్టీ మారుతున్నామ‌ని చెప్పారు. ఈ ప‌రిణామం క‌ళ్యాణ‌దుర్గం టీడీపీలో కొత్త జోష్ నింప‌డంతో పాటు స్థానిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూప‌నుంది. 


ఒకప్పటి బుల్లితెర న్యూస్ యాంకర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ఈసారి ఇలా టార్గెట్ చేసిందా..??

వైసీపీ వ‌ద్దే వ‌ద్దు... టీడీపీయే ముద్దు... జ‌గ‌నోరి దెబ్బేంటో తెలిసొచ్చిందా ?

ఏపీలో అక్క‌డ ఓట‌రు తీర్పు మారేనా... వైసీపీకి చుక్క‌లేనా ?

పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!

అనసూయ రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

టీడీపీ ఇలాకాలో వై ఛీఫ్ ట్రిక్స్ .. వైసీపీ గుండాయిజం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>