PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections99627876-e764-4811-ba47-073e26a70151-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections99627876-e764-4811-ba47-073e26a70151-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు వివాదం హాట్ టాపిక్ గా మారింది. తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు నిమ్మగడ్డ. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది jagan-nimmagadda-elections;kumaar;district;scheduled caste;collector;local language;applicationజగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?జగడ్డ: నిమ్మగడ్డకు ఓటు వేసే అదృష్టం దక్కేనా...?jagan-nimmagadda-elections;kumaar;district;scheduled caste;collector;local language;applicationSun, 31 Jan 2021 20:15:38 GMTఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు వివాదం హాట్ టాపిక్ గా మారింది. తనకు హైదరాబాద్‌లో ఉన్న ఓటును స్వాధీనం చేసి.. సొంత ఊరు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు నిమ్మగడ్డ. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుంది కదా అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనడం కొసమెరుపు. అయితే నిమ్మగడ్డ కు దుగ్గిరాలలో ఓటు ఇస్తారా..!! అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాట్లాడిన జర్నలిస్ట్ సాయి ఏమన్నారంటే..??

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  మాత్రం ఇప్పటికే హైదరాబాద్లోని తన ఓటును రద్దు చేసుకుని... తన సొంతూరు దుగ్గిరాలలో ఓటు హక్కు కోసం అప్పీల్ చేసుకున్నారు. అయితే ఇటీవలే అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించగా... తన ఓటు హక్కు కోసం కోర్టు కైనా వెళ్తానని ఘాటుగా స్పందించిన నేపథ్యంలో... తాజాగా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ అంశంపై స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు మీద జిల్లా యంత్రాంగం విచారణ జరుపుతోందని గతంలో ఓటు తిరస్కరించినప్పటికీ... నిమ్మగడ్డ మళ్లీ అప్పీల్ చేశారు.

కాబట్టి అధికారులు ఇప్పుడు విచారణ చేపట్టారని కలెక్టర్ చెబుతున్నారు. బహుశా ఓటు వస్తుందేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజకీయ విశ్లేషకుడు జర్నలిస్టు సాయి. వాస్తవానికి రూల్ ప్రకారంగా చూసుకుంటే... దుగ్గిరాల లో నివాసం ఉంటుంటే ఓటు హక్కు ఇవ్వాలి... నివాసం లేకపోతే ఓటు హక్కు ఉండదు ఇంతకు ముందు హైదరాబాదులో ఉన్న ఓటు హక్కును రద్దు చేసుకొని మరి దుగ్గిరాలలో దరఖాస్తు చేశాను అన్నారు. అయితే తాను ఉంటున్నది విజయవాడలో లేదా హైదరాబాదులో అన్నప్పుడు దుగ్గిరాల లో ఓటు హక్కు ఎలా వస్తుంది అని పలువురు ప్రశ్నించగా... అందుకు నిమ్మగడ్డ దుగ్గిరాలలో తన ఆస్తులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

కానీ ఆస్తి అనేది హక్కు కిందకు రాదు కేవలం ఆ ఊరిలో నివసిస్తుంటే మాత్రమే ఓటు హక్కుకు  అర్హులు.. అని అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు తిరస్కరించిన నేపథ్యంలో... నిమ్మగడ్డకు ఓటు హక్కు కల్పిస్తారా..?? ఒకవేళ కల్పిస్తే... రేపు ఎవరైనా దాన్ని ప్రశ్నించి సవాలు చేస్తే.. ఏం జరుగుతుందో, రానున్న రోజుల్లో చర్చకు వచ్చే అంశంగా పేర్కొన్నారు జర్నలిస్టు సాయి. నిమ్మగడ్డకు ఓటు హక్కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.


బిజెపిలోకి టీడీపీ అగ్ర నేత జంప్...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>