PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shashikala542fe5dd-800e-4b5a-b6e8-e3a9553b615e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shashikala542fe5dd-800e-4b5a-b6e8-e3a9553b615e-415x250-IndiaHerald.jpgఅక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని బెంగళూరు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స చేయించుకుంటున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ నేడు డిశ్చార్జ్‌ కానున్నారు. గత 11 రోజులుగా చికిత్స పొందుతున్న శశికళ.. 3 రోజులుగా ఆక్సిజన్‌ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని ఆమె చికిత్స పొందుతున్న బెంగళూరు వైద్య కళాశాల, పరిశోధనా సంస్ధ వైద్యులు తెలిపారు. శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో ‘శశికళకు పదిరోజుల చికిత్స పూర్తైంది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు. గత మూడు రోజులుగshasikala;view;ankhita;bharatiya janata party;adinarayanareddy;government;januaryత‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హైటెన్ష‌న్‌...నేడు శశికళ డిశ్చార్జి..త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో హైటెన్ష‌న్‌...నేడు శశికళ డిశ్చార్జి..shasikala;view;ankhita;bharatiya janata party;adinarayanareddy;government;januarySun, 31 Jan 2021 10:01:56 GMT

 2017లో అవినీతి కేసులో అరెస్టై నాలుగేళ్ల శిక్ష అనుభవించిన శశికళ, జనవరి 27న బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందే జనవరి 20న ఆమె అనారోగ్యం బారిన పడటంతో.. జైలు అధికారులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు ఆమె విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆస్పత్రి నుంచే పూర్తి చేశారు. ఇదిలా ఉండ‌గా  ఆస్పత్రి నుంచి శశికళ డిశ్చార్జి కాగానే అన్నాడీఎంకేకు చెందిన కొంతమంది నేతలు ఆమెను కలుసుకునేందుకు రంగం సిద్ధమైందని ఆ వర్గాలు చెబుతున్నాయి.శశికళ అండతో పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొంది నవారంతా ఇప్పటికీ తమ విశ్వాసులుగా, స్లీపర్‌సెల్స్‌గా వున్నారని, అవసరమైనప్పుడు వారంతా బయటపడతారని ఆది నుంచి దినకరన్‌ చెబుతున్నారు.


ఇప్పుడు శశికళ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే వారంతా అన్నాడీఎంకేను వీడి ఆమె వెంట నడుస్తారని, లేదా పార్టీని చీల్చి ఆమెకు అంకితం చేస్తారని ఏఎంఎంకే నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికే ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధిం చి వ్యూహరచన జరిగినట్లు ఆ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే శశికళ వ్యూహం ఫలించినట్టేనని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బీజేపీ నిశితంగా ప‌రిశీలిస్తూ సంక్షోంభం తలెత్తే అవ‌కాశం ఉంటే వెంట‌నే సానుకూలంగా మార్చుకోవాల‌ని వ్యూహాత్మ‌కంగా ఉన్న‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చర్చ జ‌రుగుతోంది.




మా అమ్మ చెపితే అఖిల్ ని చేసుకుంటా.. మోనాల్ షాకింగ్ వ్యాఖ్యలు..?

జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?

టీడీపీలో వీళ్లంతా అవుటే... బాబుకు న‌మ్మ‌కం లేకే ?

జగడ్డ : వైసీపీ తరపున నామినేషన్‌ వేస్తే.. రూ.6 లక్షలు.. బంపర్‌ ఆఫర్‌..!?

గెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>