CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/kobbari-bobbatlu1db6265c-2786-4b4d-a612-9feb13d6f0c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/kobbari-bobbatlu1db6265c-2786-4b4d-a612-9feb13d6f0c4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎప్పుడైనా ఏదైనా పండుగ వస్తే చాలు మన తెలుగు కుటుంబాల ఇళ్లల్లో పులిహోర... దానికి జతగా బొబ్బట్లు ఉండాల్సిందే.బొబ్బట్లు ఎంత రుచికరంగా వుంటాయో చెప్పనవసరం లేదు. ఎంత రుచికరంగా వుంటాయో అంతే ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈ బొబ్బట్లు అనేవి తెలుగింటి వంటకం. ఆ వంటకానికి మరింత రుచి రావాలంటే... కాస్త కొబ్బరి తురుమను జతచేయాలి. కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కొబ్బరి బొబ్బట్ల తయారీకి కావాల్సిన పదార్ధాలు.... మైదా - kobbari-bobbatlu;india;pulihora;festival;oil;letter;gas stove;gheeరుచికరమైన కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....రుచికరమైన కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....kobbari-bobbatlu;india;pulihora;festival;oil;letter;gas stove;gheeSun, 31 Jan 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఎప్పుడైనా ఏదైనా పండుగ వస్తే చాలు మన  తెలుగు కుటుంబాల  ఇళ్లల్లో పులిహోర... దానికి జతగా బొబ్బట్లు ఉండాల్సిందే.బొబ్బట్లు ఎంత రుచికరంగా వుంటాయో చెప్పనవసరం లేదు. ఎంత రుచికరంగా వుంటాయో అంతే ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈ  బొబ్బట్లు అనేవి తెలుగింటి వంటకం. ఆ వంటకానికి  మరింత రుచి రావాలంటే... కాస్త కొబ్బరి తురుమను జతచేయాలి. కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో  తెలుసుకుందాం.

కొబ్బరి బొబ్బట్ల తయారీకి కావాల్సిన పదార్ధాలు....

మైదా - ఒక కప్పు,
కొబ్బరి తురుము - ఒక కప్పు,
నీళ్లు - ఒక కప్పు,
కొబ్బరి నూనె - ఒక టీస్పూను,
బెల్లం తురుము - ఒక కప్పు,
పసుపు - పావు టీ స్పూను,
యాలకుల పొడి - ఒక స్పూను,
నెయ్యి - రెండు స్పూనులు,
ఉప్పు - చిటికెడు

కొబ్బరిబొబ్బట్లు తయారు చేయు విధానం....

ముందుగా ఓ గిన్నెలో మైదా, పసుపు, ఉప్పు కాస్త నీళ్లు వేసి పిండిలా కలపాలి. అందులో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. బొబ్బట్లకు ఎంత పదునుతో పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకుని ఓ 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. మలినాలుంటే తీసేయాలి. ఆ బెల్లం మిశ్రమాన్ని వడకట్టాలి. ఆ బెల్లం మిశ్రమంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఆ బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. తేమ పోయేంత వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ఉండలా చుట్టి చేత్తొనే పూరీ లా ఒత్తి మధ్యలో... కొబ్బరి మిశ్రమం పెట్టాలి. అంచుల్నీ మూసేసి... మళ్లీ గుండ్రంగా ఒత్తేయాలి. పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టుని దోరగా కాల్చుకోవాలి. సర్వ్ చేసే ముందు బొబ్బట్లపై ఓ చుక్క నెయ్యి వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


వైసీపీలో `పంచాయ‌తీ` ర‌గ‌డ‌.... ఎంపీ వ‌ర్సెస్ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే ?

జగన్ బాటలో రేవంత్ రెడ్డి!

బరిలోకి బాలయ్య... రచ్చ మామూలుగా ఉండదుగా...?

కుర్ర హీరోల ముందు తేలిపోయిన చిరంజీవి

సర్కారువారి పాట - 36 లక్షలు

జగడ్డ: వైసీపీకి మరో షాక్.. వారి దూకుడుకు నిమ్మగడ్డ బ్రేక్...?

ఆ సినిమాతో మిస్సైన రికార్డులన్ని ఈ సినిమాతో షురూ చేస్తారా.. వకీల్ సాబ్ రిలీజ్ హంగామా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>