PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war2ab96cc0-f199-4263-a2f8-bf2f0c78769c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war2ab96cc0-f199-4263-a2f8-bf2f0c78769c-415x250-IndiaHerald.jpgఏపీలోనే ఉంటే బాగుంటుందన్న తమ ప్రయోజనాల కోసం.. అప్పుడప్పుడూ '0' కి.మీ రాయిని ఉన్నచోట నుంచి తీసి, అశ్వారావుపేటకు సమీపంలో అంటే దాదాపు 120 మీటర్లు పైగా జరిపి ఏర్పాటు చేశారు. దీంతో అప్పటికే అక్కడ నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఏపీలోకి వెళ్లిపోయినట్లయింది.ap ts war;godavari river;andhra pradesh;telangana;district;suryapeta;local language;bhadradri;pettaతెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదంతెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదంap ts war;godavari river;andhra pradesh;telangana;district;suryapeta;local language;bhadradri;pettaSun, 31 Jan 2021 10:03:22 GMTఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్త వివాదం నెలకొంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు సమీపంలో రెండు  రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏపీకి సమీప ప్రాంతమైన అశ్వారావుపేట నుంచి పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ జిల్లాలకు రహదార్లున్నాయి. సూర్యాపేట- దేవరపల్లి జాతీయ రహదారి ఇక్కడి నుంచే వెళ్తుంటుంది. అయితే జీలుగుమిల్లి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గరలో ఉన్న సరిహద్దు '0' కి.మీ రాయిని తీసిపడేసి.. అశ్వారావుపేట పట్టణం చివర్లో '0' కి.మీ గుర్తును చూపుతూ ఏపీ రోడ్లు భవనాల శాఖ అధికారులు రాయిని పాతారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ అధికారులు
తొలగించడంతో వివాదం మళ్లీ మొదలైంది.

   రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సంబంధించిన సరిహద్దు అశ్వారావుపేటకు నియోజరవర్గంలోని జీలుగుమిల్లి వద్ద ఏర్పాటైంది. అక్కడే '0' కి.మీ రాయిని ఏర్పాటు చేశారు. ఆ సమీపంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయశాఖ, ఎక్సైజ్‌, రవాణా, వాణిజ్యపన్నులు, అటవీశాఖల  చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే స్థానికంగా ఉండే కొందరు ఏపీలోనే ఉంటే బాగుంటుందన్న తమ ప్రయోజనాల కోసం.. అప్పుడప్పుడూ '0' కి.మీ రాయిని ఉన్నచోట నుంచి తీసి, అశ్వారావుపేటకు సమీపంలో అంటే దాదాపు 120 మీటర్లు పైగా జరిపి ఏర్పాటు చేశారు. దీంతో అప్పటికే అక్కడ నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఏపీలోకి వెళ్లిపోయినట్లయింది.

     సరిహద్దు వివాదంతో అశ్వారావుపేట- జీలుగుమిల్లికి మధ్యలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటైన జలగం తండా, ఎన్టీఆర్‌ కాలనీ వాసుల పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. వీరంతా నిజానికి అశ్వారావుపేట మండలానికి చెందినవారే. ఈ నియోజకవర్గంలోనే ఓట్లు కూడా ఉన్నాయి. ఇంటి బిల్లులు, కరెంటు బిల్లులు,ఓట్లు అన్నీ ఉన్నా ఎప్పటికప్పుడు మీరు ఇక్కడోళ్లు కాదంటూ తెలంగాణ అధికారులు  వేధిస్తున్నారన్నది ఇక్కడి జనాల ఆరోపణ.

       తెలంగాణ ప్రభుత్వం కోట్ల వ్యయంతో ఈ తండాల్లో ‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తోంది. కానీ సరిహద్దులు మార్చినపుడల్లా అవి రాష్ట్రాలు మార్చుకుంటున్నాయి. '0' కి.మీ రాయిని జీలుగుమిల్లి వద్ద ఉంచితే పైన పేర్కొన్నరెండు కాలనీలు తెలంగాణలో ఉంటాయి.. కాకుండా '0' కి.మీ రాయిని అశ్వరావుపేట చెక్‌పోస్టుకు సమీపంలోకి మారిస్తే  ఏపీలోకి వెళ్లిపోతాయి. దీంతో వీళ్లంతా ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దు వివాదాలు తలెత్తుతుండడంతో తమ పిల్లలకు సర్టిఫికెట్ల జారీలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు చొరవ చూపి ఇలాంటి సరిహద్దు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.






ఈ దెబ్బతో చైనాకు చెక్.. ఈశాన్యంలో భారత్ పక్కా ప్లాన్..!

జగడ్డ : సీన్ లోకి మరో రాజ్యాంగ సంస్థ...షాక్ ఎవరికి ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: మల్లాదికి పెరుగుతున్న బ్రాహ్మ‌ణ సెగ‌.. ఒక్క హామీ నెర‌వేర్చ‌లేదా ?

టీడీపీలో వీళ్లంతా అవుటే... బాబుకు న‌మ్మ‌కం లేకే ?

జగడ్డ : వైసీపీ తరపున నామినేషన్‌ వేస్తే.. రూ.6 లక్షలు.. బంపర్‌ ఆఫర్‌..!?

గెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>