PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కు లాగుతుంది. ఏపీ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా ఉన్నాయనే ఆరోపణలు గత కొంత కాలంగా వినపడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం కూడా సర్కార్ ఆపేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికల సంఘం నుంచి వస్తున్న అభ్యంతరాలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా సరే సర్కార్ మాత్రంys jagan;jagan;andhra pradesh;high court;local language;houseహైకోర్ట్ లో జగన్ కు మరో షాక్...!హైకోర్ట్ లో జగన్ కు మరో షాక్...!ys jagan;jagan;andhra pradesh;high court;local language;houseSun, 31 Jan 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎన్నికల సంఘం మాత్రం వెనక్కు లాగుతుంది. ఏపీ సర్కార్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజలను ప్రలోభ పెట్టే విధంగా ఉన్నాయనే ఆరోపణలు గత కొంత కాలంగా వినపడుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం కూడా సర్కార్ ఆపేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికల సంఘం నుంచి వస్తున్న అభ్యంతరాలు కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నా సరే సర్కార్ మాత్రం ఆగడం లేదు.

ఇక ఇదిలా ఉంటే వచ్చే నెల ఒకటి నుంచి ఒక కార్యక్రమం మొదలవుతుంది. రేపట్నుంచి ప్రారంభమయ్యే ఇంటింటికీ రేషన్ పథకంపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై ఏపీ హైకోర్ట్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ సర్కార్. కొద్దిసేపటి క్రితం పిటిషన్ ను విచారించిన హైకోర్ట్... రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని రెండ్రోజుల్లో ఎస్ఈసీని కలవాలని ఆదేశించిన హైకోర్ట్... ఐదు రోజుల్లో ఈ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్ట్ సూచనలు చేసింది.

రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదని ఈ సందర్భంగా రాష్ట్ర హైకోర్ట్ స్పష్టంగా చెప్పింది. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరు అని ఏపీ సర్కార్ స్పష్టంగా వెల్లడించింది. ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలి అని ప్రభుత్వం పేర్కొంది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి అని రాష్ట్ర హైకోర్ట్ సూచించింది. అంతకుముందు రాజకీయ పార్టీల రంగుల్లేకుండా పథకం నిర్వహించుకోవచ్చని ఎస్ఈసీ స్పష్టంగా వెల్లడించింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కార్ కి షాక్ తగిలింది.


ఎంపీ రేవంత్ రెడ్డికి ఓటు లేదు! తేలిన గ్రేటర్ ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్క

జగడ్డ : అడకత్తెరలో పోక చెక్కలా సీఎస్..

జగడ్డ..వైసీపీ టార్గెట్ కి భారీ షాక్...?

బ్రాహ్మణ ఘోష : ప్రభుత్వానికి ఆ చట్టం చేసే ధైర్యం ఉందా ?

అనుష్క కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలే...?

అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసుకోండి.. !!

జగడ్డ : నిమ్మగడ్డ అక్కడే గురి...పెద్ద దెబ్బే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>