Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kumaraswamyc5c3a031-c7e0-450b-97b3-c7f2a329093c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kumaraswamyc5c3a031-c7e0-450b-97b3-c7f2a329093c-415x250-IndiaHerald.jpg జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో తనను పేరుకే ముఖ్యమంత్రిని చేశారని, తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. దీనికి పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీనే కారణమని మండిపడ్డారు. 14 నెలలపాటు తాను సీఎంగా..kumaraswamy;bharatiya janata party;karnataka - bengaluru;congress;government;cm;chief minister;aqua;party;raccha'నేను పేరుకే సీఎం.. అంతా వాళ్ళ చేతుల్లోనే.. నోరు విప్పిన మాజీ సీఎం''నేను పేరుకే సీఎం.. అంతా వాళ్ళ చేతుల్లోనే.. నోరు విప్పిన మాజీ సీఎం'kumaraswamy;bharatiya janata party;karnataka - bengaluru;congress;government;cm;chief minister;aqua;party;racchaSun, 31 Jan 2021 20:55:47 GMTబెంగళూరు: జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో తనను పేరుకే ముఖ్యమంత్రిని చేశారని, తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం లేకుండా చేశారని జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తీవ్ర విమర్శలు చేశారు. దీనికి పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీనే కారణమని మండిపడ్డారు. 14 నెలలపాటు తాను సీఎంగా ఉన్నానని, కానీ తాను ముఖ్యమంత్రి కంటే ప్రభుత్వంలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గానే పని చేశానని కుమారస్వామి వాపోయారు. కుమారస్వామి నేడు(ఆదివారం) మీడియాతో మాట్లాడారు. రానున్న శాసన సభ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వంలో తన పాత్రను కుమారస్వామి గుర్తు చేసుకున్నారు. తాను నామమాత్రంగానే సీఎం పదవిలో ఉన్నానని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా తనను కట్టడి చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో తనకు స్వేచ్ఛ ఏమాత్రం ఉండేది కాదని, అన్ని వైపుల నుంచి తనపై ఒత్తిడి ఉండేదని చెప్పారు.

ముఖ్యంగా కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత సిద్ధరామయ్య తనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన పథకాలను, సాగునీటి పారుదల ప్రాజెక్టులను కొనసాగించాలని చెప్పేవారని తెలిపారు. మరోవైపు అప్పటి ప్రతిపక్ష పార్టీ బీజేపీ తనపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రచ్చ చేసేదని, వాటిని తిప్పికొట్టడం మానేసి కాంగ్రెస్ నాపైనే ఒత్తిడి తీసుకొచ్చేదని చెప్పుకొచ్చారు. రైతుల పంట రుణాలను రద్దు చేస్తానని బూటక హామీలు ఇచ్చి తాను అధికారంలోకి వచ్చానని బీజేపీ ఆరోపిస్తూ ఉండేదన్నారు. నిర్ణయాలు చేయడానికి ఎటువంటి స్వేచ్ఛ తనకు ఉండేది కాదనేది వాస్తవమని చెప్పారు.

ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో గత ఎన్నికల ఎన్ని మలుపులు తిరిగాయి అందరికీ తెలిసిందే. శాసన సభ ఎన్నికల్లో అటు బీజేపీకి కానీ, ఇటు కాంగ్రెస్ కి కానీ పూర్తి మెజారిటీ రాకపోవడం జేడీఎస్ కు కలిసొచ్చింది. దీంతో దేవెగౌడ అధ్యక్షతలోని జేడీఎస్.. తమ పార్టీ నుంచి సీఎం అయితేనే మద్దతిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ సరేనంది. దేవెగౌడ తనయుడు కుమారస్వామికి సీఎం కుర్చీ కట్టబెట్టింది. అయితే ఆయన సీఎం కుర్చీ ఎక్కువ రోజులు నిలవలేదు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులపై కుమారస్వామి ఎట్టకేలకు నోరు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.


మహేష్ బాబుతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు జగనోరు చేదోడుగా ఉన్నారా ..??

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క కూతురు హిమ బయట ఎంత అందంగా ఉందో మీరే చూడండి..!!

సొంతూరులోనే అచ్చెన్నకు షాక్!

అనసూయ డిమాండ్ మాములుగా లేదుగా హీరోయిన్లకు పోటీగా దూసుకుపోతుంది...

సోషల్ మీడియాలో సితార vs అర్హ దూకుడు ...వార్ వన్ సైడ్ కాదు

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం సొంతిళ్లు కట్టించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>