PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaramd9138d47-5bc0-4231-b43a-57f6c72f3336-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/karanam-balaramd9138d47-5bc0-4231-b43a-57f6c72f3336-415x250-IndiaHerald.jpgర‌వాణా చార్జీల కింద‌.. ఎంత లేద‌న్నా.. రూ.200 ఖ‌ర్చు అవుతుంది. ఇక‌, టీలు, టిఫెన్ల ఖ‌ర్చు ఎంత త‌క్కువ‌గా వేసుకున్నా.. మ‌రో వంద రూపాయ‌లు ఖాయం. దీంతో సామాన్యుల‌కు ఇది తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. ఇక‌, చీరాల‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనో.. రిమోట్ ఏరియాల్లోనో ఉండేవారికి ఈ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రం. వాస్త‌వానికి త‌మ ఓటుతో గెలిచిన నాయ‌కుడు.. త‌మ‌కు అందుబాటులో ఉంటార‌ని.. ఎవ‌రైనా అనుకుంటారు. కానీ, క‌ర‌ణం మాత్రం త‌న‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉంటూ.. ప్ర‌జ‌లు అక్క‌డికే వ‌చ్చి త‌మ‌స‌మ‌స్య‌లు karanam balaram;naina;nithya new;rtc;2019;district;mla;letter;local language;chirala;central government;yuva;ycp;amanchi krishna mohan;partyగెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?గెలిచింది చీరాల‌.. ఉండేది ఒంగోలు.. క‌ర‌ణం తీరే వేర‌యా.. ?karanam balaram;naina;nithya new;rtc;2019;district;mla;letter;local language;chirala;central government;yuva;ycp;amanchi krishna mohan;partySun, 31 Jan 2021 09:01:00 GMTజిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి నిత్యం ఏదో ఒక విష‌యంలో సెంట‌రాఫ్‌ది న్యూస్‌గా నిలుస్తున్నారు. ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ నేత‌ల‌తో వివాదాలు.. ర‌గ‌డ‌లు ఆయ‌న‌కు నిత్య‌కృత్య‌మ‌నే మాట వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణంపై ఇప్ప‌టికే అనేక వివాదాలు.. ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి నెల‌కొంది. ఇక‌, ఇప్పుడు అసలు.. ఆయ‌న‌ను క‌ల‌వాలంటే.. కూడా అందుబాటులో లేర‌నే టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి గ‌త 2019 ఎన్నిక‌ల్లో క‌ర‌ణం.. చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. అయితే.. ఆయ‌న మ‌కాం మాత్రం ప్ర‌కాశం జిల్లా కేంద్రం ఒంగోలులో! దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య క‌నెక్టివిటీ త‌గ్గిపోయింది.

చీరాల ప్ర‌జ‌లు త‌మ‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఎమ్మెల్యేను క‌లుసుకునేందుకు ఒంగోలులో ఎమ్మెల్యే కార్యాల‌యానికి వెళ్లాల్సి వ‌స్తోంది. చీరాల నుంచి ఒంగోలుకు వెళ్లాలంటే.. ఆర్టీసీ బ‌స్సులో గంట సేపు ప్ర‌యాణం చేయాలి. ఇక‌, ర‌వాణా చార్జీల కింద‌.. ఎంత లేద‌న్నా.. రూ.200 ఖ‌ర్చు అవుతుంది. ఇక‌, టీలు, టిఫెన్ల ఖ‌ర్చు  ఎంత త‌క్కువ‌గా వేసుకున్నా.. మ‌రో వంద రూపాయ‌లు ఖాయం. దీంతో సామాన్యుల‌కు ఇది తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. ఇక‌, చీరాల‌లోని గ్రామీణ ప్రాంతాల్లోనో.. రిమోట్ ఏరియాల్లోనో ఉండేవారికి ఈ ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రం. వాస్త‌వానికి త‌మ ఓటుతో గెలిచిన నాయ‌కుడు.. త‌మ‌కు అందుబాటులో ఉంటార‌ని.. ఎవ‌రైనా అనుకుంటారు.

కానీ, క‌ర‌ణం మాత్రం త‌న‌కు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉంటూ.. ప్ర‌జ‌లు అక్క‌డికే వ‌చ్చి త‌మ‌స‌మ‌స్య‌లు చెప్పుకోవాల‌ని ష‌రతు పెడుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. పైగా ప్ర‌స్తుతం గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏవిష‌యంపై నైనా మాట్లాడాలంటే .. కూడా ఒంగోలుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్మం.

చివ‌ర‌కు అధికారుల‌కు కూడా ఈ బాధ‌లు త‌ప్ప‌డం లేదు. క‌ర‌ణం క‌న్నా.. స్థానికంగా ఉండే.. మాజీఎమ్మెల్యే వైసీపీ యువ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అయితే.. బెట‌ర్ అని అంటున్నారు.. ఇక్క‌డి ప్ర‌జ‌లు. ఇక‌, మ‌రికొందరు ఎమ్మెల్సీ సునీత అయినా బెట‌రేన‌ని చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో ఈ ప‌రిస్థితి క‌ర‌ణానికి ఇబ్బందిక‌రంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణం వ‌ల్ల వైసీపీకి నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త పెరుగుతోన్న ప‌రిస్థితి కూడా ఉంద‌ని పార్టీ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.




మోదీ వెన‌క్కి త‌గ్గారు... ఢిల్లీలో రైతుల ఉద్య‌మానికి కేంద్రం త‌ల‌వంచుతోంది....

జగడ్డ: నెల్లూరులో బీజేపీ-జనసేన మాస్టర్ ప్లాన్..

జగడ్డ: గవర్నర్ ను శాసించే అధికారం నిమ్మగడ్డకు ఉందా...?

కాపు వేద‌న‌: ప‌వ‌న్‌ను కాపులు అందుకే న‌మ్మ‌ట్లేదా ?

కాపు వేద‌న‌: ప‌వ‌న్ క‌న్నా.. చిరునే బెట‌ర్.. గుర్తుకొస్తున్న‌ నాటి ఘ‌ట‌న..‌!

రియల్ హీరో కు టాలీవుడ్ లో విలన్ గా కలిసొచ్చిన సినిమాలు.!! ఏంటో తెలుసా ?

జగడ్డ: టీడీపీకి ఆనాటి శృంగారం.. ఇప్పుడు వ్యభిచారంగా మారిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>